కంటెంట్ కన్నా క్లైమాక్స్ ముఖ్యం.. బొమ్మ హిట్ కొట్టాలంటే .. అది చాలా ముఖ్యం..?
మన దర్శకులు కూడా ఇప్పుడు దీనిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు .. ముఖ్యంగా గత దీపావళికి వచ్చిన క, లక్కీ భాస్కర్ సినిమాలని తీసుకోండి .. ఈ సినిమాలకు క్లైమాక్స్ ఎంతో కీలకం. మరి ప్రధానంగా క సినిమాకు క్లైమాక్స్ ఆయువు పొట్టు .. రెండున్నర గంటల క సినిమాలో చివరి రెండు నిమిషాల్లోనే ట్విస్ట్ రివిల్ చేశారు దర్శకులు ద్వయం సుజిత్ , సందీప్ .. వాళ్ల రైటింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు . ఈ క్లైమాక్స్ కారణంగానే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది .. మిగిలిన సినిమా అంతా ఎలా ఉన్న చివరి రెండు నిమిషాల వరకు కథను హోల్డ్ చేశారు దర్శకులు ..
ఇది కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ . అలాగే లక్కీ భాస్కర్ క్లైమాక్స్ కూడా అంతే చివరి ఐదు నిమిషాల్లో వెంకీ అట్లూరి తన మ్యాజిక్ చేశారు .. 100 కోట్లు ఇచ్చేయడం తో కథ ముగిస్తే లక్కీ భాస్కర్ మంచి సినిమా అయ్యుండేది .. కానీ అక్కడి నుంచే వెంకీ స్క్రీన్ ప్లే మ్యాజిక్ మొదలు పెట్టాడు . ఇప్పుడు తాజా గా గేమ్ చేంజర్ క్లైమాక్స్ ని కూడా అలాగే డిజైన్ చేశారట శంకర్ .. బేసిక్ గానే అపరిచితుడు , రోబో , 2.0 వంటి సినిమాల్లో క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది .. ఇక గేమ్ చేంజర్ వీటికి మించి ఉంటుందని తెలుస్తుంది . అది ఎలా ఉండబోతుందో తెలియాలంటే జనవరి 10 వరకు ఎదురు చూడాల్సిందే .