పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కేసేలాటలో అల్లు అర్జున్ అభిమాని రేవతి చనిపోగా ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రస్తుతం అతను కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం లో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మొత్తం అల్లు అర్జున్ ని పరామర్శించింది.అయితే దీనిపై సీఎంరేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. అల్లు అర్జున్ కి ఏం జరిగిందని అతడిని పరామర్శిస్తున్నారు. ఒక్కరోజు జైలుకు వెళ్లి వస్తే సినీ ప్రముఖులు అతని ఇంటికి క్యూ కట్టారు అంతేకానీ చనిపోయిన రేవతి కుటుంబాన్ని గాని ప్రాణాలతో పోరాడుతున్న ఆ బాబుని గాని ఒకరు కూడా వచ్చి పలకరించలేదు. పైగా తొక్కిసలాటకు అల్లు అర్జున్ రోడ్డు షో కారణమని హీరో బాధ్యత లేకుండా ప్రవర్తించడం వల్లనే అలాంటి ఒక దురదృష్ట సంఘటన జరిగిందని, దీనికి బాధ్యత అల్లు అర్జున్ దే అని ఫైర్ అయ్యారు.అంతేకాకుండా ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్స్ కి పర్మిషన్ ఉండదని చెప్పేశారు .ఈ క్రమంలో ఇప్పుడు గాయాలతో చికిత్స పొందుతున్న శ్రీ తేజ అనే బాలుడు విషయంలో సినిమా పరిశ్రమ చాలా వరకు భయపడుతుంది.అందుకే ఇప్పుడు ఆ బాలుడి ప్రాణం కాపాడే విషయంలో సినిమా పరిశ్రమ మొత్తం నానా కష్టాలు పడుతోంది.
అందుకే సినిమా పెద్దలు కూడా ఆ బాలుడు చికిత్స పొందుతున్న హాస్పిటల్ యాజమాన్యంతో ఇప్పటికే చర్చలు జరిపారు. ఎంత ఖర్చైనా పర్వాలేదని అవసరమైతే విదేశాలకు కూడా పంపిద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ బాలుడిని పరామర్శించేందుకు తాజాగా పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ కూడా వెళ్ళాడు.అలాగే నిన్న అల్లు అరవింద్ కూడా ఆ బాలుడిని పరామర్శించారు. సుకుమార్ భార్య బాలుడు కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. డిసెంబర్ 9న శ్రీ తేజ్ తండ్రికి ఐదు లక్షల సహాయం అందించారు. అటు అల్లు అరవింద్ కూడా బాలుడు విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఎంతైనా ఖర్చు పెట్టడానికి అల్లు అరవింద్ రెడీ అవుతున్నారు. ఆ బాలుడికి జరగడానికి జరిగితే మాత్రం కచ్చితంగా మరోసారి అల్లు అర్జున్ పై మరో కేసు నమోదయ్య అవకాశం ఉంటుంది. అందుకే అల్లు అరవింద్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అప్పుడు కచ్చితంగా అరెస్టు చేయడమే కాకుండా మరిన్ని ఇబ్బందులు అల్లు అర్జున్ ఎదుర్కొక తప్పదు అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. దీనితో సినిమా పరిశ్రమ కూడా భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమనే అభిప్రాయం ఉన్న నేపథ్యంలో సినిమా వాళ్ళందరూ ఆ హాస్పిటల్ కు పరుగులు తీస్తున్నారు. శ్రీతేజను పరామర్శించడానికి మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్ళనున్నారట. అలాగే రామ్ చరణ్ తో కలిసి వరుణ్ తేజ్ కూడా హాస్పిటల్ కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.