ఒకప్పుడు దేశాన్ని ఉపేసిన హీరోయిన్ .. ఇప్పుడు పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరంటే..?
ఇక 2019లో వచ్చిన నకాష్, 2017లో అలీఫ్ సినిమాల్లో సిమల ముఖ్య పాత్రలో కనిపించింది .. ఆ సినిమాలో ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి .. ఆ తర్వాత ఈమెకు ఇంకా మంచి సినిమాలు వచ్చి ఉండేవి .. కానీ ఆమెకు నటనతో పాటు రాజకీయాలు సామాజిక శాస్త్రంపై కూడా ఎంతో ఆసక్తి ఉండేది. అందుకే ఆమె పోటీ పరీక్షకులకు ప్రిపేర్ అయ్యింది .. అలా మొదటి ప్రయత్నంలోనే సిమల పీఎస్సీలో ఉత్తీర్ణత సాధించింది .. డీఎస్పీగా పోస్టింగ్ కూడా తెచ్చుకుంది .. అయితే ఆమె కళ ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు .. ఐపీఎస్ లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు మరింత ముందుకు వెళ్ళింది.
ఎలాంటి కొచింగ్ తీసుకోకుండా పరీక్షల్లో యూపీఎస్సీలో అగ్రస్థానంలో ఉత్తీర్ణత సాధించింది .. ఇది కచ్చితంగా ఆమెను ప్రశంసించాల్సిన గొప్ప విషయం. నటి నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగిన సిమల ప్రయాణం నిజంగా ఎంతో ప్రశంసనీయం .. ఇదే క్రమంలో నేను ఈ ఐపీఎస్ యూనిఫాంలో నన్ను నేను చూసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు .. కానీ ఇప్పుడు నా మనసు అంత ఎంతో ఆనందంగా ఉంది అని ఒకానొక సందర్భంలో సిమల చెప్పుకొచ్చింది .. సిమల ప్రసాద్ భూపాల్ నగరంలో 1980 అక్టోబర్ 8న జన్మించింది.. చిన్నతనం నుంచి ఆమె తనకి ఇష్టమైన డాన్స్ యాక్టింగ్ ని కొనసాగించింది.. అలాగే పలు పోటీల్లో పాల్గొనేది .. ఇదే క్రమంలో సిమల తండ్రి డాటర్ భగీరథ ప్రసాద్ ఐఏఎస్ అధికారి ఆయన అడుగుజాడల్లోనే నడిచిన ఈమె కూడా ఐపీఎస్ అధికారిగా దేశానికి సేవలందిస్తుంది.