ఒక్క ప్లాప్ పడ్డా దుకాణం సర్దుకోవాల్సిందే.. అనిల్ షాకింగ్ కామెంట్స్..!!
ఆ డైరెక్టర్ వైపు హీరో, నిర్మాతలు చూసే పరిస్థితి ఉండదన్నారు. అప్పటి వరకు రాసుకుపూసుకుని తిరుగిన వారు కూడా ముఖం చాటేస్తారు. ఇక్కడ హిట్లు ఉంటేనే అవకాశాలు ఉంటాయి. లేదంటే? దుకాణం సర్దుకుని వెళ్లి పోవా ల్సిందే. ఇండస్ట్రీలో ఏ రోజు ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. ఇది సెక్యూర్ లైఫ్ కాదు. ఫాంలో ఉన్నంత కాలం సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే. అది పోయిన తర్వాత అవకాశాలు రాలేదన బాధపడకూడదు' అన్నారు.ఇదిలావుండగా సంక్రాంతి కి వస్తున్నాం సినిమా సంక్రాంతికి రాబోతున్న విషయం తెల్సిందే. సంక్రాంతికి ఉన్న పోటీ నేపథ్యంలో ఈ సినిమాను రంగంలోకి దించి, అందుకు తగ్గట్లుగా జనాల్లోకి సినిమాను తీసుకు వెళ్లాలి అంటే ఇలాంటి ట్రిక్స్ వాడాలి అనే విషయం దర్శకుడు అనిల్ రావిపూడికి బాగా తెలుసు. అందుకే విభిన్నంగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో తాజాగా ఈ సినిమా గురించి పెట్టిన ప్రెస్మీట్లో నటీ నటులను కాకుండా పాత్రలను తీసుకు వచ్చారు. చీర కట్టులో ఐశ్వర్య రాజేష్, పోలీస్ ఆఫీసర్ గా మీనాక్షి చౌదరి ఆకట్టుకున్నారు. ఇక వెంకటేష్ గడ్డంతో పాటు పంచెలో కనిపించారు. మొత్తానికి ఈ ఐడియా భలే ఉందని అంతా అనిల్ రావిపూడి ఐడియాకి ఫిదా అయిపోయారు.