ఎయిర్ పోర్ట్ లో మరోసారి అడ్డంగా బుక్ అయినా రూమర్ కపుల్.!

FARMANULLA SHAIK
టాలీవుడ్ రూమర్ కపుల్  స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. రిలేషన్ లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. తమ లవ్ మ్యాటర్ పై ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవరూ ఓపెన్ అవ్వకపోయినప్పటికీ అంతా మాత్రం ఫిక్సయిపోయారు. రీసెంట్ గా రష్మిక.. తాను సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీతో రిలేషన్ లో ఉన్నట్లు పరోక్షంగా తెలిపారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ.. రష్మికతో లవ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఓ ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయ్యారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తానే చెబుతానని అన్నారు. సెలబ్రిటీ కనుక.. తన పర్సనల్ లైఫ్ పై అందరికీ ఆసక్తి ఉంటుందని అన్నారు. అపరిమితమైన ప్రేమ అనేది ఉందో, లేదో తనకు తెలియదని అన్నారు.దీంతో వారిద్దరూ కామెంట్స్ ఫుల్ గా ట్రెండ్ అవుతుండగా.. రీసెంట్ గా ఫేమస్ రీల్ పోస్ట్ చేశారు విజయ్. అందులో 2025లో పెళ్లి చేసుకుంటావా అంటే నో అని చెబుతున్న వీడియోను షేర్ చేశారు. అలా వచ్చే ఏడాది తాను పెళ్లి చేసుకోవడం లేదని పరోక్షంగా తెలిపారు. దీంతో రష్మిక, విజయ్ వివాహం ఎప్పుడు చేసుకుంటోరనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.

అదే సమయంలో తాజాగా విజయ్, రష్మిక.. ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ముంబై విమానాశ్రయంలో సోమవారం రాత్రి మెరిశారు. ముందుగా రష్మిక.. ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. ఆ సమయంలో కెమెరాకు పోజులిచ్చారు. అక్కడే ఉన్న ఫ్యాన్స్ తో పిక్స్ దిగారు. ఆ తర్వాత విజయ్ రాగా.. ఆయన కూడా అభిమానులతో ఫోటోస్ తీసుకున్నారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రష్మిక వద్దనున్న క్యాప్ ను విజయ్ ధరించడంతో ఇద్దరు కలిసి వచ్చారనే చర్చ జరుగుతుంది.అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ ఫెస్టివల్స్ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో విజయ్, రష్మిక వాటిని సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నట్లు ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇద్దరూ తమ షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని.. విదేశాలకు వెళ్తున్నారని చెబుతున్నారు. న్యూ ఇయర్ తర్వాత తిరిగి ఇండియా రానున్నారని అంటున్నారు. ఇక విజయ్.. ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న VD 12 మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. మరోవైపు, రష్మిక రీసెంట్ గా పుష్ప-2తో సందడి చేయగా చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మరి అప్ కమింగ్ మూవీస్ తో ఇద్దరూ ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి. కాగా ఇద్దరి మధ్య ఉన్న బంధం పై ఎవరూ పెదవి విప్పట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: