అల్లుఅర్జున్ అరెస్ట్ పై జానీ మాస్టర్ ఏమన్నారంటే.?

FARMANULLA SHAIK
సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, రేవతి మరణం, శ్రీతేజ్‌ ఆస్పత్రి పాలు, అల్లు అర్జున్‌ అరెస్ట్‌ ఇదీ ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తున్న హాట్‌ టాపిక్‌.దాదాపు రెండువారాలకు పైగా ఇదే సంచలనం. ప్రస్తుతం బెయిల్‌ మీద బయటున్న అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసుల నుంచి నోటీసులు అందాయి. మంగళవారం విచారణకు హాజరు కావాలని ఆ నోటీస్‌ సారాంశం. అయితే ఈ రోజు 11 గంటలకు బన్నీ తన లీగల్‌ టీమ్‌తో కలిసి విచారణకు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ పై ఓ రిపోర్టర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను ప్రశ్నించారు.ఈ విషయంపై స్పందించాలని కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ను  మీడియా కోరగా ఈ విషయంలో నేనేం మాట్లాడదలుచుకోలేదు. నేనే ఒక ముద్దాయిని. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు కోర్టులో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్‌ కాదు. న్యాయస్థానంపై, నాకు నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలి అని జానీ మాస్టర్‌ అన్నారు.ఇదే క్రమంలో మీకు మరియు అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు వచ్చిన తర్వాతే అరెస్ట్ అయ్యారు. దీని గురించి మీరేమంటారు? అని విలేఖరి అడగ్గా అందుకు జానీ మాస్టర్ సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అయితే జానీ మాస్టర్ బన్నీ అరెస్ట్ పై రియాక్ట్ అవ్వకుండా అక్కడినుంచి వెళ్లిపోవడంపై నెట్టింట పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే ఇప్పుడు జానీ మాస్టర్ బన్నీ అరెస్ట్ పై సైలెంట్ అవ్వడంతో అతను అల్లు అర్జున్, సుకుమార్ లకు భయపడి మాట్లాడలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.  కొందరు మాత్రం ఈ ఇష్యూను ఇంకా పెద్దది చేయడం ఇష్టం లేకే జానీ మాస్టర్ రియాక్ట్ అవ్వలేదని అంటున్నారు. ఇదిలావుండగా జైలుకు వెళ్లకముందు వెళ్లొచ్చిన తర్వాత మీకు ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది? అని అడగ్గా ఒకేలా ఉందని జానీ మాస్టర్‌ సమాధానమిచ్చాడు. గుండెల మీద చెయ్యి వేసి మరీ చెబుతున్నా పరిశ్రమలు నా గుర్తింపు, గౌరవం ఎప్పటిలాగే ఉంది అని అన్నారు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: