రేవంత్ మాత్రమే కాదు.. అయన కూడా అల్లు అర్జున్ ని టార్గెట్ చేశాడు.. బిజెపి నేత షాకింగ్ కామెంట్స్?

praveen
ఐకాన్ బాబు చుట్టూ ముసురుకున్న వివాదాలు చినికి చినికి గాలివానలా మారుతూ రోజురోజుకూ తీవ్ర రూపాన్ని దాల్చుతున్నాయి. అసెంబ్లీలో చర్చతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చంద్రాయణగుట్ట శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సహా పలువురు సభ్యులు ఈ తొక్కిసలాట ఉదంతంపై ఘాటుగా స్పందించడంతో ఈ వివాదం మరింత ముదిరిందని చెప్పుకోవచ్చు. మరోవైపు అదేరోజు సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టయింది.
ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్, శాసన మండలి సభ్యుడు బల్మూరి వెంకట్ ఘాటుగా స్పందిస్తూ... వారి సినిమా కారణంగా నిర్దాక్షిణ్యంగా ఓ వ్యక్తి చనిపోయినా అల్లు అర్జున్‌లో ఎంతమాత్రమూ పశ్చాత్తాపం కనిపించట్లేదని విమర్శించారు. మరోవైపు ఈ వివాదం విషయంలో కొంతమంది రాష్ట్ర బిజెపీ నేతలు అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తున్నట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బిజెపీ నేత రాజీవ్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ... నటుడు అల్లు అర్జున్ ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎం ఎల్ ఏ అక్బరుద్దీన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన తీరు చూస్తుంటే పలు అనుమానాలను రేకెత్తేలా చేస్తోందని అనుమానం వ్యక్తం చేసారు. దాంతో ఇపుడు రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
చంద్రశేఖర్ మాట్లాడుతూ... తమ రాజకీయ లబ్దికోసం అల్లు అర్జున్ జీవితంతో ఆడుకుంటున్నారని, తప్పంతా తెలంగాణ పోలీసు విభాగానిదేనని ఆరోపించారు. ఇలాంటి బడా స్టార్లను వత్తిడి చేసి, డబ్బులు దోపిడీ చేయడం కాంగ్రెస్ నాయకులకు మొదటి నుండీ బాగా అలవాటైపోయిన వ్యవహారమేనని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం రేవంత్, అక్బరుద్దీన్ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేసారు. దాంతో ఈ మాటలు ఇపుడు మీడియా సర్కిల్స్ లో సెగలు పుట్టిస్తున్నాయి. దాంతో తెలంగాణ రాష్ట్ర నాయకులు చాలామంది చంద్రశేఖర్ మాటల్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇకపోతే ఇదే విషయంపైన తెలంగాణ భారతీయ జనతా పార్టీ లోక్‌సభ సభ్యుడు ఎం రఘునందన్ రావు స్పందిస్తూ అల్లు అర్జున్ పట్ల సానుకూలంగా మాట్లాడడం కొసమెరుపు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్ ప్రమేయం ఏముందని ప్రశ్నిస్తూ... ఎన్నో సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్నాయని, వాటితో పోల్చి చూస్తే ఇది చిన్నదేనని వ్యాఖ్యానించడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: