అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. అల్లు అరవింద్ సంచలన నిర్ణయం.. ఇంటి చుట్టూ?
అయితే, ఇక అల్లు అర్జున్ ఎప్పుడైతే ఈ వివాదంలో చిక్కుకున్నారో అప్పటినుండి కూడా మీడియా ఆయన ఇంటి ముందట కాపలా కాస్తున్నారు. ఈ క్రమంలోనే తన ఇంటికి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? అనే విషయాలు తెలియకుండా ఉండడం కోసం ఇంటికి, అదే విధంగా గేటు ముందు పరదాలు కట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు కొంతమంది తెలంగాణ విద్యార్థి సంఘాలు అల్లు అర్జున్ ఇంటిపై తాజాగా దాడి చేసిన నేపథ్యంలో కూడా ఇలా పరదాలు కట్టమని అల్లు అర్జున్ తండ్రి అయినటువంటి అల్లు అరవింద్ పురమాయించినట్టు తెలుస్తుంది.
అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ పరదాలు కట్టిన 2 గంటల వ్యవధిలోనే తిరిగి వాటిని తొలగించినట్టు గుసగుసలు కూడా వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే అసలు అల్లు అర్జున్ ఇంటికి ఎందుకు ఇలా పరదాలు కట్టడం, తరువాత తొలగించడం అనే విషయంపై సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి. ఇక విచారణకు హాజరైన అల్లు అర్జున్ తో పాటు తన లాయర్లు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. అదేవిధంగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి అల్లు అరవింద్ కూడా బన్నీ వెంట పోలీస్ స్టేషన్ కి వెళ్లగా... ఆయనని పోలీసులు బయటే ఉండమని సూచించినట్టు సమాచారం. ఇక తాజా విచారణలో భాగంగా పోలీసులు అల్లు అర్జున్ ని ఎలాంటి ప్రశ్నలు వేశారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.