శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల...ప్రస్తుతం ఎలా ఉన్నాడంటే?

MADDIBOINA AJAY KUMAR
ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీ తేజ్ కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని డాక్టర్స్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రి ICU లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆ బాలుడి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
ప్రస్తుతం శ్రీ తేజ్ వెంటిలేటర్ సాయం లేకుండా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడాని తెలిపారు. శ్రీ తేజ్ కి ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నారని చెప్పారు. బాలుడు సైగలను గమనిస్తున్న కూడా మాటలను అర్దం చేసుకోలేకపోతున్నాడని డాక్టర్లు అన్నారు. శ్రీతేజ్ ఫీడింగ్ సక్రమంగా తీసుకుంటున్నాడని.. న్యూరాలజీ కండీషన్ స్థిరంగా ఉందని డాక్టర్స్ తెలిపారు. శ్రీ తేజ్ త్వరగా కొలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
ఇక ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్‌ యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‎ను అరెస్ట్ చేయగా.. నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వెంటనే బన్నీ హై కోర్టును ఆశ్రయించగా అక్కడ ఊరట లభించింది. ఈ కేసులో అల్లు అర్జున్‎కు హై కోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.  అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఆయనను కలవడానికి చాలా మంది వచ్చి వెళ్లడం జరిగింది. ఇక సంధ్య థియేటర్‌ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఓ సినీనటుడిని అరెస్ట్‌ చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ తప్పు ఉందని.. అందుకే అతను బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: