పోలీసుల దగ్గర అల్లు అర్జున్ ఎమోషనల్..లంచ్ కూడా చేయకుండా!
ఇక ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ను అరెస్ట్ చేయగా.. నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వెంటనే బన్నీ హై కోర్టును ఆశ్రయించగా అక్కడ ఊరట లభించింది. ఈ కేసులో అల్లు అర్జున్‌కు హై కోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఈ క్రమంలో సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కి మహిళ చనిపోయిందని తెలిసినప్పటికి ఆయన సరైన పద్దతిలో స్పందించలేదని సమాచారం. దీంతో ఇటీవల జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. ఆ దాడిని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తీవ్రంగా ఖండించారు. దాడి అనంతరం అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఎవరు ఇలాంటి దుశ్చర్యలకు ప్రేరేపించకూడదని కోరారు. కాస్తా ఓపికగా ఉండాలని అభిమానులను రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.