వాడుకుని వదిలేశాడా అంటూ కామెంట్స్.. వాళ్లకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటి
ఇటీవల ఇనాయా తన ప్రియుడు గౌతమ్‌కి బ్రేకప్ చెప్పేసినట్టు ఉంది. ఆమె ఈమెకి బ్రేకప్ చెప్పాడో.. లేదంటే ఈమే అతనికి బ్రేకప్ చెప్పిందో ఏమో కానీ.. తాను సింగిల్ అంటూ విరహవేదనతో రగిలిపోతున్న వరుస పోస్ట్‌లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అంతేకాదు.. ఇనయా తన ప్రియుడితో దిగిన ఫొటోలన్నింటినీ కూడా డిలీట్ చేసింది. అటు గౌతమ్ కూడా ఇనయాతో దిగిన ఫొటోలన్నీ డిలీట్ చేసి పారేశాడు.
అలాగే ఇనయా సుల్తానా తన ఫోటోలను షేర్ చేస్తూ వాటి కింద 'నా లైఫ్, నా ఛాయిస్, నా ప్రాబ్లమ్స్, నా తప్పులు, నా పాఠాలు. మీరు నా గురించి మాట్లాడే ముందు మీ సొంత సమస్యలపై దృష్టిపెట్టండి. నా జీవితం గురించి చెప్పడానికి ఇది నీ కథ కాదు’ అంటూ రాసుకొచ్చింది. ఫైనల్‌గా బ్రేకప్ సింబల్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే.. ప్రియుడితో బ్రేక్ అప్ అయ్యిందనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. అయితే ఒకప్పుడు వీరిద్దరిని ఆటలను చూసిన నెటిజన్స్ కూడా బ్యూటీ ఇనయా సుల్తానా, గౌతమ్ కొప్పిశెట్టి ఎక్కువ కాలం కలిసి ఉండరని చెప్పుకొచ్చారు. ఇక అందరూ అనుకున్నట్లే ఇద్దరు విడిపోయారు. ఇది చూసిన నెటిజన్స్ బాయ్ ఫ్రెండ్ వాడుకుని వదిలేశాడా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.