రంగంలోకి దిల్ రాజు.. అల్లు అర్జున్ ఇష్యూకు పుల్ స్టాప్ పడినట్టేనా?
ఇదిలా ఉండగా.. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు నేడు శ్రీతేజ్‌ను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇన్ని రోజులు నేను అమెరికాలో ఉన్న కారణంగా బాలుడిని పరామర్శించేందుకు రాలేక పోయాను. అందుకే ఇప్పుడు వచ్చాను. త్వరలోనే అల్లు అర్జున్ ని కూడా కలుస్తాను. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటినీ చూస్తున్నాను. అలాగే దీన్ని పరిష్కరించడానికి పలువురిని కలుస్తాను. టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా తెలుగు సినిమా పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వంకు మధ్య వారధిగా ఉండి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాను. ఈ వివాదానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తాను' అంటూ దిల్ రాజు స్పష్టం చేశారు. దీంతో అల్లు అర్జున్ కేసుకి ఫుల్ స్టాఫ్ పడుతుందని సమాచారం.
ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత దిల్‌రాజుకి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ పదవిలో దిల్ రాజు రెండేళ్లు కొనసాగానున్నారు. ఎన్నో మంచి మంచి సినిమాలను తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మించి విజయం సాధించిన దిల్ రాజు అగ్ర నిర్మాతల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.