అల్లు అర్జున్ కి అండగా హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Divya
హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోకి ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లాడని అక్కడ భారీ జనం రావడంతో తొక్కిసలాట జరిగిందని అందులో రేవతి అనే మహిళ మరణించారని ఆమె కుమారుడు శ్రీ తేజ్ కు  గాయాలవ్వడం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే.. ఈ విషయం పైన అటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై అటు అల్లు అర్జున్ పైన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడమే కాకుండా ఒకరోజు జైల్లో ఉంచి బెయిల్ మీద బయటకు పంపించడం జరిగింది.

అయినప్పటికీ కూడా ఈ వివాదం మునగ లేదు.. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళా మరణించిన సంఘటన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో అల్లు అర్జున్ పైన ఇండస్ట్రీ పెద్దల పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. ఇక మీదట తాను సీఎంగా ఉన్న సమయంలో టికెట్ ధరలు పెంచను, ప్రీమియర్ షోలు ఉండవు అంటూ తెలిపారు.

తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి చాలామంది అల్లు అర్జున్ కి మద్దతుగా నిలిచారు. కానీ ఈ ఘటన పైన హీరోయిన్లు పెద్దగా ఎక్కడ రియాక్ట్ అయినట్లుగా కనిపించలేదు. కానీ తాజాగా ఈ ఘటన పైన హీరోయిన్ సంజనా గల్రానీ అల్లు అర్జున్ కి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ తొక్కిసలాటలో అల్లు అర్జున్ బాధ్యులు కారు, నిందితుడు కూడా కారనీ తెలియజేసింది. తెలుగు రాష్ట్రాలలో సినిమా హీరోలకు వేరే లెవల్లో ఫ్యాన్ బెస్ ఉందని.. వాళ్లది అభిమానం కాదని అది పిచ్చి అంటూ వెల్లడించింది.. ఆ థియేటర్ కి హీరో రావడం అనేది అది మొదటిసారి కాదని వివరించింది. మొత్తానికి ఈ విషయంలో అల్లు అర్జున్ అయితే బాధ్యులు కాదు అంటూ బన్నికి సపోర్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: