అచ్చం పుష్ప2 సినిమాలో మాదిరే..బన్ని ఏం దెబ్బ కొట్టబోతున్నాడు రా సామి..!?

Thota Jaya Madhuri
పుష్ప .. జస్ట్ ఇది ఒక పేరు కాదు ఇది ఓ బ్రాండ్ . ఇది పుష్ప సినిమాలో శ్రీవల్లి చెప్తుంది . అయితే నిజ జీవితంలో సైతం పుష్ప అంటే అది ఒక పేరు కాదు అని అది ఒక బ్రాండ్ అనేలా మారిపోతున్నాడు బన్నీ . ప్రెసెంట్ అల్లుఅర్జున్ కి సంబంధించిన విషయాలు ఎలా మీడియాలో లీక్ అయిపోతూ వైరల్ గా మారుతున్నాయో మనకు తెలిసిందే.  మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అంటూ చాలామంది ట్రై చేశారు.  కానీ చిరంజీవి మ్యాటర్ లోకి ఇన్వాల్వ్ అయి మధ్య లో బెయిల్ ఇప్పించి అల్లు అర్జున్ ని సేఫ్ గా బయటకు రంపించారు . అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి పరోక్షకంగా ఎదిరించేలా మాట్లాడడం ఆయన చేసిన బిగ్ మిస్టేక్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు .


ఆ కారణంగానే రేవంత్ రెడ్డికి కోపం వచ్చి అసలు సంధ్య థియేటర్లో ఏం జరిగింది ..? అన్న విషయం మినిట్ టూ మినిట్ వీడియా రిలీజ్ చేశారు . దీనితో పూర్తిగా సీన్ రివర్స్ అయిపోయింది . అల్లు అర్జున్ తప్పు చేశాడు అంటూ క్లారిటీకి వచ్చేసింది. అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి సంబంధించిన కొన్ని వార్తలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప2 సినిమాలో ఏ విధంగా పుష్పరాజ్ తన పలుకుబడితో తన హవాతో తన డబ్బుతో సీఎంనే మార్చేశాడో.. సేమ్ టు సేమ్ అదే సీన్ రిపీట్ కాబోతుంది అంటూ తెలంగాణ స్టేట్ లో టాక్ వినిపిస్తుంది . స్వయాన ఒక లాయర్ ఈ విషయాన్ని బయట పెట్టడం సంచలనంగా మారింది.


బన్నీ విచారణ తర్వాత అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే . "అల్లు అర్జున్ ని కొంతమంది రాజకీయ పావుగా ఉపయోగించుకుంటున్నారు అని ..పుష్ప సినిమాలో జరిగినట్టే రేవంత్ రెడ్డి సర్కార్ ని కూల్ చేసే ప్రయత్నం జరుగుతుంది అని.. బిగ్ బాంబు పేల్చారు.  అల్లు అర్జున్ వెనుక ఓ అదృశ్య శక్తి ఉంది అని .. కచ్చితంగా రేపటి నుంచి మరొక వారం రోజుల్లో రేవంత్ సర్కార్ పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు".


దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు పుష్ప2 సినిమాలోని కొన్ని డైలాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.  సినిమాలో సీఎం ఫోటో ఇవ్వకపోతేనే పుష్ప రాజ్ కి కోపం వచ్చింది .. మరి రియల్ లైఫ్ లో ఆయనను ఈ విధంగా బాధపెడుతున్నారు బన్నీకి ఇంకా ఎంత కోపం వస్తుంది .. అదే స్ట్రాటజీ ఇక్కడ అప్లై చేశారు. సీఎంనే మార్చేయబోతున్నాడు బన్నీ అంటూ బన్నీ ఫ్యాన్స్ ఓ  రేంజ్ లో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన టాలెంట్ను ఆయన పలుకుబడిని పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: