వార్ 2 : హమ్మయ్య షూటింగ్ ముగిసింది.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?

murali krishna
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్  నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాతో ఎన్టీఆర్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ తెచ్చుకుంది.. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమాకు త్వరలో పార్ట్ 2 కూడా రాబోతుంది..ఆల్రెడీ దర్శకుడు కొరటాల స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టాడు..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ మ్యూజిక్ అందించిన దేవర సినిమాలో హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది..అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..

దేవర మూవీ ఇచ్చిన ఊపు లో ఎన్టీఆర్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు..ప్రస్తుతం ఎన్టీఆర్ రెండు భారీ సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా కాగా మరోటి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 మూవీ. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా రానుంది. ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూ వస్తుంది. కాగా ఈ సోమవారంతో ఈ సినిమా షూటింగ్ కు మేకర్స్ గుమ్మడికాయ కొట్టారు.ఇటీవల ఫైనల్ షెడ్యూల్ ను అమెరికాలో మొదలెట్టి భారీ యాక్షన్ సీక్వెన్స్ ను మేకర్స్ తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూట్ మొత్తం పూర్తి అయింది..దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ -2 ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ఉన్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: