ప్ర‌భాస్ - రాఘ‌వేంద్ర‌రావు కాంబోలో మిస్ అయిన సినిమా ఇదే..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ లో స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్ - మహేష్ బాబు - అల్లు అర్జున్ లాంటి ఎంతోమంది నటులను తెలుగు తెర‌కు పరిచయం చేశారు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు. తొలి సినిమా ఆయనతో చేస్తే చాలు నటనలో పాస్ అయినట్టేనని భావించే హీరో హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. పైగా మాస్ .. క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల వారి అభిమానం ఒకే సినిమాతో సంపాదించుకుంటే వాళ్ల కెరీర్ కు తిరుగులేని పునాది అవుతుంది. అందుకే అగ్ర నిర్మాత‌లు ... నటులు సైతం తమ వారసులను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను రాఘవేంద్రరావు చేతిలో పెడుతూ ఉంటారు. ప్రభాస్ విషయంలోని ఇదే జరిగింది. తనకు రాఘవేంద్రరావు బెస్ట్ ఫ్రెండ్ కావడంతో ప్రభాస్ను హీరోగా పరిచయం చేయాలని అడిగారట. ప్రభాస్ తండ్రి రాఘ‌వేంద్ర రావుకు చాలా స‌న్నిహితంగా ఉంటారు.

ఆ సాన్నిహిత్యం తోనే రాఘవేంద్రరావు తో ప్ర‌బాస్ తండ్రి .. త‌న వార‌సుడిని హీరోగా వెండి తెరకు పరిచయం చేయాలని అనుకున్నారట. అప్పటికే ఆయన పోలీసులు బిజీగా ఉండడంతో కుదరలేదు అని రాఘవేంద్రరావు ఓ సందర్భంగా తెలియజేశారు. అయితే ఈ అవకాశం దర్శకుడు జయంత్‌ కు దక్కింది. ఆయనే ప్రభాస్ ని ఈశ్వర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. ఇక తర్వాత రాఘవేంద్రరావు - ప్రభాస్ కాంబినేషన్లో సినిమా రాలేదు. ఇక ఇప్పుడు రాఘవేంద్రరావు దర్శకత్వం మానేశారు. మరోవైపు ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు .. ఇప్పుడు ప్ర‌భాస్ సినిమా అంటే నే పాన్ ఇండియా స్థాయి లో క్రేజ్ ఉంటోంది. ప్ర‌భాస్ ను అందుకోవ‌డం ఓ మోస్త‌రు ద‌ర్శ‌కుల కు సాధ్యం కావ‌డం లేదు. ఇలాంటి టైం లో ఈ ఇద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందని ఆశించడం కలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: