రేవతి మృతికి తొక్కిసలాట కారణం కాదు.. డాక్టర్స్ సంచలన రిపోర్ట్.?

Pandrala Sravanthi
పుష్ప టు ప్రీమియర్స్ ని సంధ్య థియేటర్లో చూడడానికి వచ్చిన రేవతి అనే మహిళ ఫ్యామిలీతో కలిసి దాదాపు 12,000 ఖర్చు పెట్టి పుష్ప-2 సినిమా చూడడానికి ఎంతో ఆతృతగా థియేటర్ కి వెళ్ళింది. కానీ అదే సమయం లో అల్లు అర్జున్ కూడా అదే థియేటర్ కి సినిమా చూడడానికి రావడంతో తమ అభిమాన హీరో ని చూడడానికి అందరూ పరిగెత్తుకు వచ్చారు. ఇక ఒకేసారి అంతమంది జనం ఎగబడడంతో అక్కడికి ఫ్యామిలీ తో కలిసి వచ్చిన రేవతి ఆ జనం తొక్కిసలాటలో మరణించిన సంగతి మనకు తెలిసిందే.అయితే రేవతి తొక్కిసలాటలో చనిపోలేదని డాక్టర్లు సంచలన విషయాన్ని బయటపెట్టారు. మరి సంధ్య థియేటర్ దగ్గర చనిపోయిన రేవతి చనిపోవడానికి అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 

రేవతి మృతికి అందరూ తొక్కిసలాటే కారణం అని ఇప్పటివరకు అనుకున్నారు. కానీ రేవతి మృతికి అసలు కారణం తొక్కిసలాట కాదట. ఆమెకు ఊపిరి ఆడక పోవడం వల్లే మరణించిందని తెలుస్తోంది. అయితే చనిపోయిన రేవతిని పోస్టుమార్టం చేసిన వైద్యులు రేవతి తోక్కిసలాటలో చనిపోలేదని ఆమెకి ఊపిరి ఆడకనే మరణించింది అని రిపోర్ట్ ఇచ్చారు. చనిపోయిన రేవతి అలాగే అపస్మారక స్థితిలో ఉన్న శ్రీ తేజ్ ఇద్దరి శరీరంలో ఒక్క ఎముక కూడా విరగలేదని, తొక్కిసలాట జరిగితే ఎముకలు విరుగుతాయి.

ఏదైనా అవయవం డామేజ్ అవుతుంది.కానీ వీరిద్దరి శరీరంలో ఎలాంటి డ్యామేజ్ కాలేదు. అవయవాలు దెబ్బ తినడం వంటి  ఆనవాళ్లు వాళ్ళిద్దరి శరీరంలో కనిపించలేదు అంటూ వైద్యులు వెల్లడించారు. అభిమానుల తాకిడి ఎక్కువ అవ్వడంతో ఊపిరి అందకనే రేవతి మరణించింది శ్రీ తేజ్ అపస్మారక స్థితికి వెళ్లిపోయారు అంటూ వైద్యులతో పాటు పోలీసులు కూడా నిర్దారణకు వచ్చారు.దీంతో రేవతి మృతికి తొక్కిసలాట కారణం కాదని, ఊపిరి ఆడకనే మరణించారని అందరికీ క్లారిటీ వచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: