సంధ్య థియేటర్: మరో వీడియో బయటకు.. తప్పంతా వారిదే?
అల్లు అర్జున్ వివాదం కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ స్వరం పెంచడంతో... ఆయనను టార్గెట్ చేశారు. దీంతో మొన్నటి నుంచి అల్లు అర్జున్ కు నిద్ర లేకుండా పోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే దీనంతటికీ కారణమైన సంధ్య థియేటర్ కు సంబంధించిన మరో సిసి కెమెరా ఫుటేజ్ బయటికి రావడం జరిగింది.
డిసెంబర్ 4వ తేదీన రాత్రి 9 గంటల 45 నిమిషాల నుంచి 9: 50 గంటల మధ్య... థియేటర్ లోపలి నుంచి రేవతి అలాగే శ్రీ తేజ్ లను తీసుకువచ్చినట్లు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. లోయర్ బాల్కనీలో అపరస్పారక స్థితిలో పడ్డ వారిద్దరిని... తీసుకువచ్చినట్లు వివరించారు పోలీసులు. అయితే రాత్రి తొమ్మిది గంటల 16 నిమిషాలకు.... రేవతి ని బయటికి తీసుకు వచ్చినట్లు... తాజాగా కొత్తగా ఓ సి సి టీవీ ఫుటేజ్ వైరల్ గా మారడం జరిగింది.
ఇక అల్లు అర్జున్ మాత్రం తొమ్మిది గంటల 40 నిమిషాలకు సినిమా హాల్లోకి వచ్చారని ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. అంటే అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందన్నమాట. అల్లు అర్జున్ రాకముందే జరిగిన సంఘటనలో రేవతి మరణించినట్లు... ఈ సి సి ఫుటేజ్ చూస్తుంటే అర్థమవుతుంది. కానీ సిసి టీవీ ఫుటేజ్ మాత్రం అర్థగంట లేటుగా నడుస్తోందని... ఆ టైం సరైంది కాదని పోలీసులు చెబుతున్నారు.
దీంతో ఈ విషయం.. హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో ఈ సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో అల్లు అర్జున్ కు సపోర్ట్ గా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని... రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మరి దీనిపై తెలంగాణ పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.