బన్నీని చూసి భయపడుతున్న సెలబ్రిటీలు.. ఇకపై పబ్లిక్ ఈవెంట్లు కష్టమేనా?

Reddy P Rajasekhar
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ చేసిన చిన్నచిన్న తప్పుల వల్ల భారీ మూల్యం చెల్లించుకుంటున్నారనే సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ను చూసి టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఒకింత భయాందోళనకు గురవుతున్నారు. తమ నిర్లక్ష్యం వల్ల ఫ్యాన్స్ కు ఏమైనా ఇబ్బంది కలిగితే తామే బాధ్యత వహించాల్సి వస్తుందేమోనని భావిస్తున్నారు. ఇకపై ఇండస్ట్రీలొ పబ్లిక్ ఈవెంట్లు కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సైతం జరిగిన ఘటనల వల్ల తీవ్ర మనోవేదనకు గురయ్యారని సమాచారం అందుతోంది. ఇకపై పబ్లిక్ ఈవెంట్లకు అనుమతులు లభించడం కూడా సులువు కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కు ఈ వివాదం ఎన్నో గుణపాఠాలను నేర్పిందని సరైన అనుమతులు లేకుండా పబ్లిక్ ఈవెంట్లకు వెళ్లకూడదని ఈ ఘటనతో బన్నీకి సైతం అర్థమైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పరంగా అంతకంతకూ ఎదుగుతుండటం గమనార్హం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయ వివాదాలకు తావు లేకుండా మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. మెగా ఫ్యామిలీతో ఉన్న సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.
 
బన్నీ త్రివిక్రమ్ సినిమాపై ఫోకస్ పెడితే ఈ ఆలోచనల నుంచి కొంతమేర మారే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా బన్నీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆటిట్యూడ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ హీరో కెరీర్ ఫోకస్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. వివాదాలకు తావివ్వకుండా బన్నీ వ్యవహరించాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: