సిఎం రేవంత్ రెడ్డి పైన అల్లు అర్జున్ కుట్ర.. నిజమేనా..?

Divya
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ కి సంబంధించి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఉదాంతం..అంటే అల్లు అర్జున్ అరెస్టు, అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు,బెయిలు,బెయిలు తర్వాత జరిగిన పరిణామాలు.. వీటన్నిటి వెనకాల ఒక సహజసిద్ధమైనటువంటి అంశం ఉందని.. ముఖ్యంగా సినిమాల కోసం బెనిఫిట్ షోకి టికెట్ తెచ్చుకున్నటువంటి ఆ కుటుంబాన్ని తప్పే.. ఆ సమయంలోనే తొక్కిసలాట జరుగుతున్నప్పుడు అల్లు అర్జున్ ది కూడా తప్పే.. రేవతి మరణించిన తర్వాత హాస్పిటల్ కి వెళ్లకపోవడం,రేవతి కుమారుడు శ్రీతేజ్ హాస్పటల్లో ఉన్నప్పటికీ పరామర్శించడానికి వెళ్లకపోవడం కూడా అతనిదే తప్పు.. అలాగే ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతున్నప్పుడు వ్యాపారం చేసుకోవడానికి సరైన భద్రత ఇవ్వడంలో విఫలమవ్వడం రేవంత్ రెడ్డి తప్పే.. ఇలా తప్పు రూట్ లో చూస్తే అందరిదీ కూడా తప్పుగానే ఉంటుంది.. కానీ కరెక్ట్ రూట్లో చూస్తే అన్ని కరెక్ట్ గానే ఉంటాయి..

అయితే వీటన్నిటి వెనకాల ఒక కుట్ర ఉందని తాజాగా వెలికి తీసినటువంటి పరిస్థితి ఇప్పుడు  ఒకటి చోటు చేసుకున్నదట. ఒక న్యాయవాది పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫిడెన్స్ తో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. అది కూడా ఓపెన్ కాన్ఫరెన్స్ పెట్టి మరి తెలియజేశారు. ఆయన ఎవరో కాదు బాదూరి శ్రీనివాస్ రెడ్డి.. పుష్ప 2 లో చూపించినట్టుగానే రేవంత్ రెడ్డిని మార్చేటువంటి కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపిస్తున్నారు.. ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక కుట్ర జరుగుతోందని అల్లు అర్జున్ వెనుక కూడా ఒక మహాశక్తి ఉందంటూ ఆయన ఆరోపించారు.. ఇప్పటివరకు జరిగిన వాటిలో అల్లు అర్జున్ కేసులో ఇది ఒక కొత్త వ్యవహారం అని చెప్పవచ్చు. ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. అయితే ఇది సహజంగా చూస్తే ఎవరూ కూడా నమ్మేలా కనిపించడం లేదట. అయితే ఇది నిజమని బాదూరి శ్రీనివాసరెడ్డి నమ్మమంటున్నారు. మరి  ఈ విషయాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: