ఆ స్టార్ హీరో ఇంట్లో ఎంజాయ్ చేస్తున్న రష్మిక-విజయ్ దేవరకొండ.?

Pandrala Sravanthi
విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సెలబ్రిటీ కపుల్స్ లో ముందుంటారు వీళ్ళిద్దరు.. వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ దాన్ని ప్రత్యక్షంగా బయట పెట్టకుండా పరోక్షంగా హింట్స్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఈ జంట మీడియా కంట పడ్డారు. ఇక తాజాగా ఈ ఇద్దరు ఒకే ఎయిర్ పోర్ట్ లో కనిపించి సందడి చేశారు. ఈ ఇద్దరు ఓకే ఎయిర్ పోర్ట్ లో వేరువేరుగా వచ్చిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.ముందుగా విజయ్ దేవరకొండ వచ్చాడు. ఆ తర్వాత వెంటనే రష్మిక మందన్నా కూడా అదే ఎయిర్ పోర్ట్ కి వచ్చింది.దీంతో వీళ్ళిద్దరూ కలిసి న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం కోసం ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్తున్నారు కావచ్చు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. 

అయితే తాజాగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ఇద్దరు ఆ హీరో ఇంటికి వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్.. బాలీవుడ్ నటుడు రన్బీర్ కపూర్ అలియా భట్ లతో రష్మిక మందన్నా విజయ్ దేవరకొండలు సన్నిహితంగా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా రణబీర్ కపూర్ తో రష్మిక మందన్నా అనిమల్ మూవీ లో బోల్డ్ గా నటించింది.ఈ సినిమాలో చేసినప్పటినుండే విజయ్ దేవరకొండ రష్మిక, అలియా బట్ రన్బీర్ కపూర్ ల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ఇద్దరు కలిసి రన్బీర్ కపూర్ ఇంటికి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం వెళ్లినట్టు బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది.అంతేకాదు వీళ్ళిద్దరికీ సంబంధించిన  సంబంధించిన ఫొటోస్ కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది. రణబీర్ కపూర్ అలియాభట్ లు షేర్ జరుపుకునే క్రిస్మస్ వేడుకల ఫొటోస్ బయటపడితే రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్ కూడా బయట పడుతుందని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: