మెగాస్టార్ వద్దన్న స్టోరీతోనే పూరీ మాస్ కంబ్యాక్..?

murali krishna
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆచార్య ఎఫెక్ట్ పడకుండా సినిమాల స్పీడ్ పెంచారు చిరు. ఆయా షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉన్న మెగాస్టార్ ఇప్పుడు మరో డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోందని ఫిలిం సర్కిల్స్ టాక్. చిరంజీవి, పూరీ జగన్నాథ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారనే డి లేటెస్ట్ టాక్. అది కూడా కొత్త సినిమా ఏమి కాదు అప్పట్లో అనుకోని ఆగిపోయిన సినిమానే అంటున్నారు. అసలు ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది,ఇప్పుడు మళ్లీ మొదలవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలావుండగా పూరీ అంటే చిరంజీవికి ముందు నుంచి నమ్మకమే. అందుకే తన కొడుకు రామ్ చరణ్ బాధ్యత కూడా అతడికే ఇచ్చారు మెగాస్టార్. చిరుతతో ఆ నమ్మకం నిలబెట్టుకున్నారు పూరీ. అదే జోష్‌లో అప్పట్లో ఆటో జానీ అంటూ చిరంజీవితో కమర్షియల్ సినిమా ప్రకటించారు పూరీ.అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఖైదీ నెం 150 స్థానంలో ఆటో జానీ చిరు 150వ సినిమా అయ్యుండేది. కాకపోతే కథ కుదరకపోవడంతో పూరీ, చిరంజీవి ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంతో ఈ ఇద్దరి మధ్య రిలేషన్ చెడిపోయిందంటూ వార్తలొచ్చాయి. ఆటో జానీ ఆగిపోయాక.. ఖైదీ నెం 150 చేసారు చిరంజీవి.

ఆ తర్వాత మళ్లీ పూరీ, చిరు ప్రాజెక్టుపై వార్తలే రాలేదు. మధ్యలో వాళ్లు కలిసింది కూడా తక్కువే. అయితే ఈ మధ్య పరిస్థితులు మారుతున్నాయి. చూస్తుంటే.. పూరీ, చిరు కాంబినేషన్‌లో షెడ్‌కు వెళ్ళిన ఆటో జానీ మళ్లీ పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య రెగ్యులర్‌గా చిరంజీవి, పూరీ జగన్నాథ్ మీట్ అవుతూనే ఉన్నారు.ఈ క్రమంలోనే ఆటోజానీ' స్టోరీ వినిపించారు. ప్రధ‌మార్ధం క‌థ వ‌ర‌కూ ఒకే ..కానీ ద్వితియార్ధంలో చిరు మార్పులు కోరారు. కానీ ఆ మార్పుల‌తో పూరి మ‌ళ్లీ అప్రోచ్ అవ్వ‌లేదు.అలా సంవత్స‌రాల కాలం గ‌డిచిపోయింది. ఈప్రోస‌స్ లో చిరంజీవి చాలా మంది డైరెక్టర్ల‌తో సినిమాలు చేసారుగానీ పూరి తో మాత్ర ప‌ట్టాలెక్క‌లేదు. చివ‌రిరికి చిరంజీవి కోర‌డంతో గాడ్ ఫాద‌ర్ సినిమాలో పూరి నే ఓచిన్న గెస్ట్ పోషిం చారు. అన్న‌య్య మాట కాద‌న‌లేక పూరి తొలిసారి ఓ స్టార్ హీరో సినిమాలో గెస్ట్ అపీరియ‌న్స్ ఇచ్చారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ఆ బాండింగ్ అలాగే ఉంద‌ని అభిమానుల‌కు అర్ద‌మైంది. అయితే పూరి ఇప్పుడు మ‌ళ్లీ 'ఆటోజానీ'ని తెర‌పైకి తెస్తున్న‌ట్లు పూరి స‌న్నిహిత వ‌ర్గాల నుంచి వినిపిస్తుంది.మెగాస్టార్ కోరిక మేర‌కు 'ఆటోజానీ' క‌థ ద్వితియార్ధంలో మార్ప‌లు చేస్తున్నారుట‌. ఇటీవ‌లే ఈ ప్రాజెక్ట్ కి సంబంధిం చిన ప‌నులు ప్రారంభించారుట‌. గోపీచంద్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ క‌థ సిద్ద‌మై రెడీగా ఉందిట‌. కానీ సెట్స్ కి వెళ్ల‌డానికి మ‌రో రెండు నెల‌లు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉందిట‌. ఈ గ్యాప్ లో 'ఆటోజానీ' క‌థ‌లో మార్పు ల‌కు క‌లం ప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.చూడాలి మరి ఈ ఆటో జానీ మూవీ ఎలాంటి సక్సెస్ ను క్రియేట్ చేస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: