సినిమా హిస్టరీలో ఫస్ట్ టైం.. విలన్ పాత్రకు రూ.200 కోట్లు?

praveen
సినిమా బడ్జెట్ వందల కోట్ల రూపాయిల పెరగడానికి కారణం హీరోలు, అందులో నటించే ప్రధాన నటీనటుల రెమ్యూనరేషన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా హీరోలు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్ల సినిమా బడ్జెట్ అనేది ఏకంగా తారాస్థాయిని అందుకుంటోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే అదే రేంజులో హీరో కాకుండా విలన్ గా నటించే ఓ నటుడికి హీరోకి మించిన రేంజ్ పారితోషకం ఇస్తున్నారు అంటే మీరు నమ్ముతారా? అవును.. మీరు విన్నది నిజమే. కన్నడ స్టార్ హీరో యష్ గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇపుడు యష్ ఓ సినిమాలో విలన్ పాత్రను చేయడం కోసం ఏకంగా వందల కోట్ల రూపాయిలు పారితోషికంగా తీసుకుంటున్నాడు మరి!
పలు కన్నడ సీరియల్స్ ద్వారా తన నటనా ప్రయాణాన్ని మొదలుపెట్టిన యష్ ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగిడి, కేజీఎఫ్ అనే సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. ప్రస్తుతం ఈయన హిందీ రామాయణం సినిమాలో రావణాసురుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం యష్ ఏకంగా రూ.200 కోట్లు తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా, రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు. ఇక హీరో, హీరోయిన్ పారితోషకాల విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఇందులో రావణుడి పాత్రలో విలన్ గా నటించడం కోసం యష్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.
అసలు విషయం ఏమిటంటే... ఇప్పటివరకు విలన్ పాత్రకు అలా భారీ మొత్తంలో తీసుకున్నవారు ఎవరూ లేరని తెలుస్తోంది. అంతేకాదండోయ్... స్టార్ హీరోలే చాలామంది ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకున్న దాఖలాలు లేవు. అలాంటిది విలన్ పాత్రకు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అంటే నిజంగా ఈయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అంటూ యష్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. 2004లో "ఉత్తరాయణ" అనే టీవీ సీరియల్ ద్వారా కెరియర్ ప్రారంభించిన యష్ తర్వాత కాలంలో నందాగోకుల, ప్రీతి ఇల్లాడ మేలే, శివలలో వంటి సీరియల్స్ లో నటించారు.. ఇక తర్వాత కన్నడ సినిమాలలో నటించడం మొదలుపెట్టారు. 2007లో వచ్చిన “జంబాడ హుడిగి” అనే చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: