ఒకప్పుడు నేను పెద్ద తాగుబోతుని.. షాకింగ్ విషయం చెప్పిన స్టార్ హీరో?
ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్‌ను తెరకెక్కించాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఒకవేళ నేను ఈ సినిమా చేయగలిగితే.. ఈ ప్రాజెక్టుతో ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేస్తానని, భారతదేశం గురించి ప్రపంచానికి చూపించాలనుకుంటున్నానని తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు. ఇదే క్రమంలో తాను గతంలో ఎలా ఉండేవాడో అమీర్ ఖానే స్వయంగా ఇక్కడ చెప్పుకు రావడం కొసమెరుపు. తన వ్యక్తిగత జీవితం గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. గతంలో పర్సనల్ లైఫ్‌లో క్రమశిక్షణ లేకపోయినా సినిమా షూటింగ్స్‌కు మాత్రం సమయానికి వెళ్లేవాడినని చెప్పుకొచ్చాడు. అప్పట్లో పైప్ స్మోకింగ్, మద్యపానం విపరీతంగా చేసేవాడిని అని అమీర్ చెప్పారు.
ఇంకా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. "తప్పు చేస్తున్నాని ఒకానొక సమయంలో గ్రహించాను. కానీ నా దురలవాట్లకు మాత్రం ఫుల్‌స్టాప్ పెట్టలేకపోయాను. ఓ రకంగా సినిమానే నాలో మార్పు తీసుకొచ్చింది. సినిమా మెడిసిన్‌లాంటిదని నేను నమ్ముతాను." అని తెలిపారు. అదేవిధంగా అవార్డ్స్ షోలకు నో చెప్పడం గురించి ప్రశ్నించగా.. సినిమా అనేది సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా సాగుతుంది.. ప్రతీ సినిమా సొంత కథను కలిగి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అమీర్ ఖాన్ ఖాతాలో సితారే జమీన్ పర్, కూలీ, లాహోర్ 1947 సినిమాలు ఉన్నాయి. తలైవా నటిస్తోన్న కూలీ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండగా.. సతారే జమీన్ పర్, లాహోర్ 1947 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.