అల్లరినరేష్ఎన్నో కామెడీ సినిమాలు చేసి భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన కామెడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో సరికొత్త కథలతో, కామెడీని సరికొత్తగా చూపించాడు నరేష్. అయితే ఈ టాలెంటెడ్ హీరో ఒకప్పుడు కామెడీ సినిమాలు చేసినప్పటికి ఇప్పుడు మాత్రం చెయ్యడం లేదు. ప్రస్తుతం సీరియస్, యాక్షన్ కథలను ఎంచుకుంటున్నాడు.కానీ ఇప్పుడు అల్లరి నరేష్ అన్ని రకాల పాత్రలను పోషిస్తూ ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నాడు. నాంది మూవీ మంచి విజయం సాధించడంతో ఇంకా డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. నా సామిరంగా చిత్రంలో అందరినీ ఏడ్పించాడు. ఇక ఇప్పుడు అల్లరి నరేష్ బచ్చల మల్లి అంటూ పూర్తిగా డిఫరెంట్ పాత్రను పోషించాడు. ఇదిలావుండగా ఈ జనరేషన్‌లో అత్యంత వేగంగా 50కి పైగా సినిమాలు చేసిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటకిరిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీని హీరోగా చేసిన వ్యక్తిగా నరేష్ క్రేజ్ సంపాదించారు. కానీ ఏమైందో ఏమో కానీ ఈ అల్లరోడిలో మనుపటి స్పీడ్ కనిపించడం లేదు. సినిమాలు ఒకదానికొకటి ఫ్లాప్ అవుతుండటంతో ఆయన కెరీర్ డౌన్‌ఫాల్ అయ్యింది.ఇకపోతే.. అల్లరి నరేష్ ఇప్పటి వరకు 65 సినిమాల్లో నటించారు.
2015 వరకు ఏడాదికి సగటును మూడు సినిమాలు తగ్గకుండా చేస్తూ వచ్చిన ఆయన తర్వాత సంవత్సరానికి ఒక్క సినిమాకే పరిమితమయ్యారు. అయితే అల్లరి నరేష్ తీసిన ఇన్ని సినిమాలలో ఓ ప్రత్యేకత కూడా ఉంది. కెరీర్‌లో దాదాపు 40 మందికి పైగా కొత్త దర్శకులను , 47 మందికి పైగా కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ ఈ విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇదిలావుండగా అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి. 1990వ దశకంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మంచి ప్రయత్నమని మెచ్చుకున్నారు తప్పించి బాక్సాఫీస్ వద్ద పూర్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. పుష్ప 2, ముఫాసా ది లైన్ కింగ్, విడుదల 2 వంటి సినిమాలు పోటీలో ఉన్న దశలో రాకుండా ఉండాల్సిందని నరేష్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.