టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో బాబి ఒకరు. ఈయన పవర్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఆఖరుగా ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్టేరు వీరయ్య అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది.
రవితేజ ఈ మూవీ లో చిరంజీవికి సోదరుడు పాత్రలో నటించగా ... రవితేజ భార్య పాత్రలో క్యాథరిన్ నటించింది. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్ చేసింది. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో తెలుగులో ఈమెకు మంచి గుర్తింపు ఈ సినిమా ద్వారా వచ్చింది. ఇకపోతే బాబి ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న డాకు మహారాజ్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా నటిస్తోంది. ఈ సినిమా నుండి ఇప్పటికే మేకర్స్ రెండు పాటలను విడుదల చేశారు.
మరికొన్ని రోజుల్లోనే మరో పాటను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యూనిట్ విడుదల చేయబోయే మూడో సాంగ్ బాలయ్య , ఊర్వశి రౌటేలా మధ్య ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.