సినిమా ఇండస్ట్రీలో ఏదైనా దర్శకుడితో భారీ బడ్జెట్ సినిమాను రూపొందించాలి అంటే కచ్చితంగా ఆయన పూర్వం ఎలాంటి సినిమాలు తీశాడు. ఆయన సినిమాల ద్వారా నిర్మాతలకు ఏ స్థాయిలో లాభాలు వచ్చాయి. అనే లెక్కలను నిర్మాతలు వేస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం ... ఏ దర్శకుడితో రూపొందిస్తున్నారో ఆ దర్శకుడికి ముందు సినిమాలు భారీ విజయాలు అందుకోకపోయి ఉంటే ఆ తర్వాత సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించిన ఆ సినిమాలకి బిజినెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
అలాగే సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకోనట్లయితే నిర్మాతకు పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించాలి అనుకునే నిర్మాతలు వారు ఏ దర్శకుడితో సినిమా చేయాలి అనుకుంటున్నారో వారి ముందు సినిమాల ట్రాక్ రికార్డును పరిశీలిస్తూ ఉంటారు. ఇకపోతే తెలుగులో పర్వాలేదు అనే స్థాయి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో రమేష్ వర్మ ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలకి దర్శకత్వం వహించగా అందులో తమిళ సినిమాకు రీమిక్ అయినటువంటి రాక్షసుడు సినిమాను మినహాయిస్తే ఈయనకు వేరే సినిమాలతో విజయాలు లేవు. ప్రస్తుతం ఈయన రాఘవ లారెన్స్ హీరోగా కాలభైరవ అనే సినిమాను రూపొందిస్తున్నాడు.
ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ దర్శకుడు అజయ్ దేవగన్ హీరోగా ఓ హిందీ మూవీ ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఈయన 200 కోట్లతో అజయ్ దేవగన్ తో సినిమా చేయబోతున్నట్లు , అందుకు ఓ నిర్మాణ సంస్థ కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దానితో పలువురు ఇప్పటివరకు ఈయనకు రాక్షసుడు మూవీని తప్పిస్తే పెద్ద విజయాలు ఏమీ లేవు. అలాంటి దర్శకుడిని నమ్మి భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించడం చాలా పెద్ద రిస్క్ అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.