బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ప్రస్తుతం బేబీ జాన్ అనే మూవీ ద్వారా మన ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో మన సౌత్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అట్లీ కథ అందించిన ఈ సినిమాకి కాలీస్ దర్శకత్వం వహించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బేబీ జాన్ మూవీ ఈరోజు విడుదలైన సంగతి మనకు తెలిసిందే. అయితే అలాంటి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్ పై గత కొద్ది సంవత్సరాలుగా ఉన్న ఒక ఆరోపణకి క్లారిటీ ఇచ్చారు.అదేంటంటే.. వరుణ్ ధావన్ అలియాభట్ ప్రైవేట్ పార్ట్స్ ని ముట్టుకోవడం.అయితే ఈ విషయం గురించి ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో వరుణ్ ధావన్ కి ప్రశ్న ఎదురవడంతో ఆయన ఈ విధంగా ఆన్సర్ ఇచ్చారు..
నేను అలియా భట్ ని అలా పట్టుకోవడం సరదాగానే జరిగింది. నాకు ఇప్పటికి కూడా అలియాభట్ ఒక మంచి స్నేహితురాలు.. అలాగే కియారా అద్వానిని నేను షూటింగ్లో అందరి ముందే ముద్దు పెట్టుకున్నానని కూడా అప్పట్లో కొన్ని వార్తలు వైరల్ చేశారు ఇది నిజమే. ఇక ఈ ముద్దు పెట్టుకునే విషయం మేము మ్యాగ్జిన్ కి స్టిల్ ఇవ్వడం కోసం దిగాం.అయితే ఈ ముద్దు పెట్టుకున్న ఫోటోని మేమిద్దరం మా సోషల్ మీడియా ఖాతాలో కూడా షేర్ చేసాం.
ఇది మా ఇష్టపూర్వకంగానే జరిగింది అంటూ వరుణ్ ధావన్ క్లారిటీ ఇచ్చారు. ఇక గతంలో వరుణ్ ధావన్ అలియా భట్ నడుముని గట్టిగా పట్టుకోవడం అప్పట్లో వివాదాస్పదం అయింది. కానీ ఈ విషయం పై తాజాగా వరుణ్ ధవన్ బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చారు. అలాగే కియారా అద్వానీని ముద్దు పెట్టుకోవడం గురించి కూడా మాట్లాడారు.