పూరీ ని ఆ విషయంలో కన్విన్స్ చేయడం చాలా కష్టం.. రఘు కుంచె షాకింగ్ కామెంట్స్..!!
ఒకే పేట్రన్ లో సినిమాలు చేస్తున్నారు. స్టోరీ నేపథ్యం మారాలి. మేకింగ్ పరంగా ఆయనకు తిరుగులేదు. మళ్లీ గొప్ప కంబ్యాక్ ఇస్తాడు. పూరి తీయాలనకుంటే మంచి కామెడీ సినిమా తీయలగడు. మంచి కామెడీ ట్రాక్ లు రాయడం ఆయనకు బాగా తెలుసు. ప్రతీ సినిమాలోనూ అద్భుతమైన కామెండీ పండిచగల దర్శకుడు. సీరియస్ యాక్షన్ స్టోరీల్లో కడుపుబ్బా నవ్వించే ట్రాక్స్ రాయడం..వాటిని తీయడంలో ఆయన స్పెషలిస్ట్.ఇక పూర్తి జానర్ లో కామెడీ సినిమా చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఆయన తీయడు. అదే వచ్చిన సమస్య. ఆయన పాత ట్రాక్ ని దాటి ఒక్క అడుగు ముందుకు వేస్తే అద్బుతాలు చేయగలడు. సినిమా ను ఆయనంత వేగంగా ఎవరూ చేయలేరు. ఇది పూరికి మాత్రమే తెలిసిన టెక్నిక్` అన్నారు.ఇదిలావుండగా ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ప్రభాస్ స్పిరిట్ సినిమా కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయబోతున్నారని తెలుగు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.అసిస్టెంట్ డైరెక్టర్ అంటే మాటల రచయితగా స్పిరిట్ సినిమాకు చేస్తారని చెబుతున్నారు.సందీప్ కు, పూరీకి మంచి స్నేహం ఉండటంవల్ల ఇది సాధ్యమవుతోంది. అయితే పూరీ జగన్నాథ్ రేంజ్ వేరు.. సందీప్ రెడ్డి రేంజ్ వేరు.. ఇదే ప్రభాస్ తో పూరీ గతంలో ఏక్ నిరంజన్, బుజ్జిగాడు సినిమాలు తీశారు. ఇప్పుడు అదే ప్రభాస్ సినిమాకు మాటల రచయితగా పనిచేయాల్సి వస్తోంది. సందీప్ కోసం రాస్తే పర్వాలేదని, కానీ ఆదాయం అనేది మనిషికి ఉండాలి కాబట్టి డైలాగులు రాస్తున్నారంటున్నారు.