బాలయ్య.. రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన సినిమాలివే.. ఫలితాలు మాత్రం అలా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్లు ఒకరు అయినటువంటి రాఘవేంద్రరావు కాంబినేషన్లో చాలా సినిమాలో వచ్చాయి. కానీ వీరి కాంపులో వచ్చిన సినిమాలలో ఏ సినిమా కూడా భారీ స్థాయి విజయాన్ని అందుకోలేదు. మరి వీరి కాంబోలో వచ్చిన సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

బాలకృష్ణ , రాఘవేంద్రరావు కాంబో లో మొదటగా రౌడీ రాముడు కొంటె కృష్ణుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రి అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ కూడా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచింది.

బాలకృష్ణ హీరో గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రెండవ మూవీ గా పట్టాభిషేకం అనే సినిమా వచ్చింది. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

బాలకృష్ణ , రాఘవేంద్రరావు కాంబోలో మూడవ సినిమాగా అపూర్వ సహోదరులు అనే సినిమా వచ్చింది. ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

బాలకృష్ణ , రాఘవేంద్రరావు కాంబో లో నాలుగవ సినిమాగా సాహస సామ్రాట్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

బాలకృష్ణ , రాఘవేంద్రరావు కాంబోలో ఐదవ సినిమాగా దొంగ రాముడు అనే మూవీ వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకుంది.

బాలకృష్ణ , రాఘవేంద్రరావు కాంబో లో ఆరవ సినిమాగా అశ్వమేధం అనే మూవీ వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమాలో శోభన్ బాబు ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

బాలకృష్ణ , రాఘవేంద్రరావు కాంబోలో ఏడవ సినిమాగా పాండురంగడు అనే మూవీ వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

ఇలా వీరి కాంబోలో మొత్తం ఏడు సినిమాలు రాగా అందులో చాలా వరకు సినిమాలు ప్రేక్షకులను నిరుత్సాహ పరచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: