పుష్ప 2: శ్రీ తేజ్ కుటుంబానికి ఇప్పటివరకు వచ్చిన ఆర్థిక సహాయ వివరాలివే..!
అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో కి వెళ్లడంతో అక్కడ తొక్కిసలాట జరగడంతో రేవతి కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం పైన అటు థియేటర్ యాజమాన్యం పైన అల్లు అర్జున్ పైన కేసు వేయడంతో ప్రస్తుతం ఈ కేసు కూడా నడుస్తూ ఉన్నది.ఇటీవలే అల్లు అర్జున్ బెయిల్ మీద కూడా బయటికి వచ్చారు. గత మూడు వారాల నుంచి తెలంగాణ ప్రతినిధులు శ్రీతేజ్ ఆరోగ్యం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కొంతమంది సినీ సెలబ్రెటీలు శ్రీతేజ్ కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. తాజాగా పుష్ప మేకర్స్ రూ .50 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని ఇచ్చారు.. అలాగే డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ , మైత్రి మూవీస్ మేకర్స్ వారు కూడా రెండు కోట్ల రూపాయలతో ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. వీటితోపాటు దిల్ రాజు కూడా రేవతి భర్తకి సినీ ఇండస్ట్రీలో ఏదైనా పర్మినెంట్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ తెలిపారు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా 25 లక్షల రూపాయలు అందించారు. అంతేకాకుండా శ్రీ తేజ అని కూడా అన్ని విధాలుగా సహాయంగానే ఉంటామని హామీ ఇచ్చారు.