"ఎల్లమ్మ" పాత్రలో లేడీ పవర్‌ స్టార్‌ ?

Veldandi Saikiran
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సాయి పల్లవి గురించి తెలియని వారంటూ ఉండరు. తాను నటించిన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎప్పటికప్పుడు వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సాయి పల్లవి ఎల్లమ్మ సినిమా ప్రాజెక్ట్ కు ఓకే చేప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

బలగం సినిమాతో తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రేక్షకులకు తెలియజేశాడు కమెడియన్ వేణు. చిన్న వయసు నుంచి కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించిన వేణు బలగం సినిమాతో డైరెక్టర్ గా మారి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇకనుంచి తాను డైరెక్ట్ చేసే సినిమాలలో కూడా తెలంగాణ కల్చర్ ఉట్టి పడేలా చేస్తానని గతంలోని వేణు మాట ఇచ్చాడు. తాను చెప్పినట్టుగానే తన తదుపరి ప్రాజెక్ట్ ఎల్లమ్మ అని అనౌన్స్ చేశాడు.

ఈ సినిమాలో హీరో ఎవరు అనే విషయం పైన చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. నాని, నితిన్ ఇలా ఎంతోమంది హీరోల పేర్లు వినిపించాయి. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఓ వార్త వైరల్ అయింది. ఇప్పుడు ఎల్లమ్మ సినిమాలో హీరో, హీరోయిన్ ఇద్దరూ ఓకే అయ్యారట. ఎల్లమ్మలో నితిన్ కు జోడిగా సాయి పల్లవి నటిస్తోంది. ఇప్పటికే తెలంగాణ అమ్మాయిగా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సాయి పల్లవి.

రీసెంట్ గా అమరన్ సినిమాలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మంత్రముగ్దులను చేసింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఎల్లమ్మ సినిమాలో నటించనుందని తెలిసి తన అభిమానులు సంబర పడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం అందుతుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే వెలువడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: