సలార్ పార్ట్ 2 పై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్ .. ఈసారి మాత్రం అలా జరగదు..?

Amruth kumar
పాన్ ఇండియ స్టార్‌ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వ‌చ్చిన‌ సలార్‌ సినిమా విడుదలై సంవత్సరం పూర్తి చేసుకుంది .. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. సలార్‌ సినిమా నాకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు .. అందుకే సలార్ 2 కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను .. ఈ సినిమా నా కెరియర్ లోనే బెస్ట్ సినిమా అవుతుందని ఆయన చెప్పుకొచ్చాడు .. ఇక స‌లార్ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డుల గురించి ప్రశాంత్ నీల్‌ మాట్లాడుతూ .. స‌లార్‌ సినిమాతో నేను అంతగా హ్యాపీగా లేను ..

సలార్ మొదటి భాగానికి నేను చేస్తున్న ప్రయత్నం పట్ల అసంతృప్తిగా ఉన్నాను .. చాలామంది ఈ సినిమా కేజీఎఫ్ 2 ల ఉందని అన్నారు .. నేను ఇంకా మంచి క్వాలిటీ సినిమా తీసుకురావాల్సింది .. ఈ కారణంగానే సలార్ 2 సినిమా కోసం చాలా కష్టపడుతున్నాను .. ఇది ఇప్పటివరకు నేను తెర‌కెక్కించిన సినిమాల్లో బెస్ట్ ఔట్పుట్ అవుతుంది .. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ వారి ముందుకు తీసుకురాబోతున్నానని నమ్మకం నాకు ఉంది . ఇక నేను దీనిపైన పూర్తి నమ్మకం ఉంచాను అయితే సలార్ 2 సినిమాపై మాత్రం చాలా ఆస‌లు ఉన్నాయని ప్రశాంత్ నీల్‌ చెప్పుకొచ్చాడు.

‘సలార్’ సినిమా డిసెంబర్ 2023లో విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ‘ఉగ్రం’కి రీమేక్ అని ప్రచారం కూడా జరిగింది. అయితే ‘సలార్ 2’ సినిమాకు మాత్రం డిఫరెంట్ కథను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రేజీ సీక్వెల్ సినిమా షూటింగ్ త్వరలో మొద‌లు కానుంది. ఈ సినిమాని కూడా హోంబాలే ఫిల్మ్స్ నిర్మించనున్నారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ‘రాజా సాబ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు .. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు .. అలాగే సందీప్ వంగా తో స్పిరిట్ .. వీటితో పాటు సలార్ 2 , కల్కి 2 సినిమాలు కూడా ప్రభాస్ లిస్టులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: