ఊహించని ప్లానింగ్ తో పిచ్చెక్కిస్తున్న డాకు మహారాజ్.. సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలే..
రీసెంట్గా జరిగిన ఈ సినిమా ప్రెస్మీట్ తో .. ఇందుకు సంబంధించిన చాలా విషయాలు చెప్పకు వచ్చారు దర్శక నిర్మాతలు . మరి ప్రధానంగా ప్రమోషనల్ ఈవెంట్స్ పైన ఎవరు ఊహించిని క్లారిటీ ఇచ్చారు .. డాకు మహారాజ్ ప్రమోషన్స్ అన్ని ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నారు మేకర్స్ .. జనవరి 2న ట్రైలర్ లాంచ్ .. 4 న అమెరికాలో అక్కడ టైమింగ్స్ ప్రకారం ప్రీరిలీజ్ ఈవెంట్ చేశాక .. 8 న ఆంధ్రాలో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు దర్శకుడు బాబి ..
గత 30 సంవత్సరాల్లో నెవర్ బిఫోర్ బాలయ్యను ఈ సినిమాలు చూపించబోతున్నానని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు దర్శక నిర్మాతలు .. అల్లాగే టిక్కెట్ రేట్లు ఇష్యూ పైన కూడా మాట్లాడారు నిర్మాత నాగ వంశీ .. ప్రజెంట్ అమెరికా నుంచి నిర్మాత దిల్ రాజు వచ్చాక ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు .. ఇక ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అక్కర్లేదని కూడా అన్నారు .. ఇక మరి ఈసారి సంక్రాంతికి బాలయ్య ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.