దుబాయ్ అండర్ గ్రౌండ్ లో దాక్కున్న టాలీవుడ్ హీరో ?
మీడియా ప్రతినిధిపై మంచు మోహన్ బాబు దాడి చేసిన కేసులో పహాడి షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంచు భక్తవత్సలం పైన హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద కొద్ది రోజుల నుంచి హైడ్రామా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోహన్ బాబు ఇంట్లోకి ప్రవేశించిన మీడియా ప్రతినిధులపై అతను దాడి చేశాడు. ఈ దాడిలో విలేఖరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
వెంటనే విలేకరి ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ఈ విషయం మీద పోలీసులు మంచు మోహన్ బాబు పైన కేసు నమోదు చేయడం జరిగింది. తనను అరెస్టు చేయవద్దని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఈనెల 24 వరకు ముందస్తు చర్యలు వద్దని పోలీసులకు తెలియజేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు మరో పిటిషన్ దాఖలు చేశారు. మోహన్ బాబు పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది.
ఆ గడువు నేటితో ముగిసింది. దీంతో మోహన్ బాబును రాచకొండ పోలీసులు మరోసారి విచారణకు పిలవనున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబును అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా మోహన్ బాబు దుబాయ్ వెళ్లిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పైన మరింత సమాచారం వెలవడాల్సి ఉంది.