ఈ మొత్తం అల్లు అర్జున్ సంధ్య ధియేటర్ ఇష్యులో.. మోస్ట్ లక్కి పర్సన్ ఎవరో తెలుసా..?

Thota Jaya Madhuri
పాపం తాను ఒకటి తలుచుకుంటే మరొకటి జరిగింది అన్న రేంజ్ లో తయారైపోయింది అల్లు అర్జున్ పరిస్థితి. ఎంతో కష్టపడి దాదాపు మూడేళ్లకు పైగానే నిద్ర తిండి లేకుండా ఎంతో శ్రమించి చేసిన పుష్ప 2 సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయితే ఆయన సొంత సినిమా థియేటర్లో చూసి ఆనందపడే అదృష్టం లేకపోయింది.  అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన పుష్ప2 సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . 1600 కోట్లు దాటేసి 2000 కోట్ల క్లబ్ లోకి చేరేందుకు సిద్ధంగా ఉంది.


అయితే అల్లు అర్జున్ మాత్రం ఊహించని చిక్కుల్లో ఇరుక్కుని అల్లాడిపోతున్నాడు . సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ 11 నిందితుడిగా అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిల్ పై బయటకు వచ్చాడు . అయితే అల్లు అర్జున్ చేసిన కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల మళ్ళీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు ప్రముఖులు . అయితే అల్లు అర్జున్ ఇష్యులో ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారు పోలీసులు . మరి ముఖ్యంగా అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ - సంధ్యా థియేటర్ ఓనర్స్ - సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ - పుష్ప 2  ప్రొడ్యూసర్స్ ..మైత్రి మూవీ మేకర్స్ ..అదే విధంగా అల్లు అర్జున్ బౌన్సర్స్ ..అందరూ కూడా టార్గెట్ అయ్యారు .


సోషల్ మీడియాలో అయితే ఏకంగా రష్మిక మందన్నాను.. శ్రీ తేజ తండ్రికి ఇచ్చి పెళ్లి చేయాలి అంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు.  అయితే ఈ అల్లు అర్జున్ ఇష్యూలో మొత్తంగా అందరూ పుష్ప2 టీం ఇరుక్కుంది . కానీ శ్రీలీల మాత్రం సేఫ్ గా ఉండిపోయింది . శ్రీలీల పై  ఒక్కటంటే ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు.  అసలు శ్రీ లీల ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది . అదే ఇప్పుడు ఆమెకు ప్లస్ గా మారింది అంటున్నారు జనాలు . శ్రీలీల కూడా ఈ ఇష్యూలో ఇరుక్కుంటే కెరీర్ నాశనం అయిపోయుండేది అని చాలా పక్కాగా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది అని మాట్లాడుకుంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: