సినిమా వాళ్ల‌కు కేసీఆర్‌, కేటీఆర్ మీదున్న ప్రేమ రేవంత్ మీద ఎందుకుండ‌దు..?

RAMAKRISHNA S.S.
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి మొత్తానికి తన ఏంటో తన పవర్ ఏమిటో టాలీవుడ్కు అర్థమయ్యేలా చెప్పారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత టాలీవుడ్‌కు తెలంగాణ సీఎం పదవి అంటే ఎంత పవర్ఫుల్ అర్థం అయ్యేలా చేశారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ - కేటీఆర్ కు టాలీవుడ్ వంగి సలాం చేసింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ .. కేటీఆర్ కు టాలీవుడ్ గులామ్‌ చేసింది. కేసీఆర్ - కేటీఆర్ అంటే టాలీవుడ్ లో భయం భక్తి - గౌరవం - ప్రేమ - స్నేహం అన్ని ఉన్నాయి. ఇందుకు కారణం ఏంటంటే హైదరాబాదులో టాలీవుడ్ ప్రముఖులు విస్తరించుకున్న సామ్రాజ్యం వల్లే అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఎందుకో ? తెలియదు కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటే టాలీవుడ్కు ముందు నుంచి చిన్న చూపే. ప్రధానంగా జాతీయ పార్టీ కావడం వలన ఏమోగానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిల‌కు టాలీవుడ్ ఎప్పుడు విలువ ఇవ్వలేదు. అదే చంద్రబాబు విషయంలో వేరేగా ఉండేది .. చాలా ప్రయోజనాలు పొందింది. వైయస్ సీఎం అయ్యాక కొందరు మన టాలీవుడ్ లో చాలామంది దూరం దూరంగా ఉండేవారు. వైయస్ అనంతరం రోశయ్య - కిరణ్ కుమార్ లను టాలీవుడ్ అసలు ముఖ్యమంత్రిగా చూడలేదు. వారికి కూడా సినిమా వాళ్ళను పట్టించుకునే అంత తీరిక ఉండేది కాదు. రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువమంది సినిమా వాళ్ళు ఆంధ్రమూలాలు ఉన్నవారు కావడంతో సినిమా వాళ్లకు భయం పట్టుకుంది. దీంతో అందరూ కేసీఆర్ - కేటీఆర్ లకు బాంచన్ అన్నారు. అలా పదేళ్లు కులాసాగా గడిచిపోయాయి.

ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రావడంతో టాలీవుడ్ అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అన్నట్టుగా కూడా చూడటం లేదు. ఆయన గద్దర్ అవార్డులు ఇస్తామన్నా పట్టించుకోలేదు .. చివరకు చిరంజీవికి సన్మానం అంటే కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడు అయితే సంధ్య థియేటర్ ఘటన తెరమీదకు వచ్చిందో రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పవర్ చూపించడం మొదలుపెట్టారు. ఇప్పుడు టాలీవుడ్ సినీ జనాల్లో మళ్ళీ భయం మొదలైంది. ఒకటి తక్కువయింది .. ఒకటి తక్కువయింది అని పుష్పలో షెకావ‌త్ చెప్పినట్టుగా ఇప్పటివరకు రేవంత్ విషయంలో టాలీవుడ్ ఒకటి తక్కువ చేసింది .. అదే రెస్పెక్ట్. ఇప్పుడు ఇక అది టన్నులు టన్నులుగా కనిపిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: