హెరాల్డ్ ప్లాష్‌బ్యాక్ 2024 : టాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెంచ‌రీ హీరోలు వీళ్లే... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఒకప్పుడు టాలీవుడ్‌లో వందకోట్లు అంటే కొండత టార్గెట్ లా కనిపించేది. కానీ ఇప్పుడా టార్గెట్ మంచినీళ్లు తాగినంత సుల‌భం అయ్యింది. ఈ ఏడాది కూడా బాక్సాఫీసు మురిసింది. వెయ్యికోట్లు కొట్టిన రెండు సినిమాలు, మూడు వందల కోట్ల మార్కు దాటిన సినిమాలు.. అలాగే సెంచరీ కొట్టిన సినిమా లు ఉన్నాయి. ఆ లెక్కేంటో చూద్దాం. గుంటూరు కారం సినిమాకు ఆశించిన టాక్ రాలేదు. అయినా రు. 170 కోట్ల గ్రాస్ వ‌చ్చింది. అనూహ్య విజ‌యం సాధించిన హ‌నుమాన్‌ దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది.

ప్ర‌భాస్ క‌ల్కి సినిమా వెయ్యికోట్ల మార్క్ ని దాటేసింది. డీజే టిల్లు 2 టోటల్ రన్ లో ఈ సినిమా 120 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దేవ‌ర రు. 550 కోట్లు కొల్ల‌గొట్టింది. నాని, దుల్కర్ సల్మాన్ లాంటి యంగ్ హీరోలు ఈ ఏడాది సెంచరీలు కొట్టే సినిమాలు చేశారు. దుల్క‌ర్ స‌ల్మాన్ ల‌క్కీభాస్క‌ర్ కూడా తెలుగు తో పాటు మిగిలిన భాష‌ల్లో అల‌రించింది. ఈ సినిమా కూడా రు. 100 కోట్లు సాధించింది. గత ఏడాది దసరా, హాయ్ నాన్నలతో అలరించి ఈ ఏడాది ‘ సరిపోదా శనివారం ’ తో హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు.

ఇక 2024కి అల్టిమేట్ టచ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సీక్వెల్ పుష్ప 2 ఇచ్చింది. డిసెంబర్ 5న వచ్చిన పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీసు ని రూల్ చేస్తూ ... తెలుగులో పాటు హిందీలో అదరగొట్టింది. ఇప్పటికే 1,700 కోట్ల గ్రాస్ దాటిసినట్లు ట్రేడ్ వర్గాలు లెక్కకట్ట‌గా .. ఈ సినిమా ఇంకా రన్ లో వుంది. ఫైనల్ మార్క్ ఎంత అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: