హెరాల్డ్ 2024:అత్యధికంగా పాటల కోసం ఖర్చు చేసిన మూవీ గేమ్ ఛేంజర్.. ఎన్ని కోట్లంటే..?
గేమ్ ఛేంజర్ చిత్రం కోసం సాంకేతిక నిపుణులతో పాటు విఎఫ్ఎక్స్ వరకు కూడా ప్రతిదీ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఇతర దేశాలలో విఎఫ్ఎక్స్ పనులను నిర్వహించడమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా భారీగానే ఈ సినిమాకి ఖర్చు చేస్తున్నారట చిత్ర బృందం. ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటే.. ఆరు పాటలకు కూడా అదిరిపోయి సెట్స్ వేసి తెరకెక్కించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాలోని పాటల సెట్టింగ్ కోసం సుమారుగా 92 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారట. శంకర్ మొదటి ఈ సినిమా పాటల కోసమే 100 కోట్లు ఫిక్స్ చేసుకున్నప్పటికీ .. అయితే ఇందులో ఎనిమిది కోట్లు మాత్రం డైరెక్టర్ శంకర్ నిర్మాతకు సేవ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో ప్రతి పాటకు కూడా భారీగానే ఖర్చు చేసినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే సుమారుగా ఇందులోని పాటలకు 15 నుంచి 18 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి.. ఈ పాటల కోసం అటు హీరోయిన్ కియారా, హీరో రామ్ చరణ్ కూడా చాలా కష్టపడినట్లుగా ఎన్నో సందర్భాలలో తెలిపారు. వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ ఏడాది అత్యధికంగా పాటల కోసమే ఖర్చు చేసిన సినిమాగా టాలీవుడ్ నుంచి గేమ్ ఛేంజర్ సినిమా నిలిచిందని అభిమానులు భావిస్తున్నారట.