ముగ్గురు కూతుళ్లతో వెంకటేష్ .. నాగచైతన్య గురించి అంత మాట అనేసాడుగా..!

Amruth kumar
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం .. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు .. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి .. ఇప్పటికి ఈ సినిమా నూంచి వ‌చ్చిన‌ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి .. ప్రధానంగా గోదారి గట్టుమీద రామచిలకవే సాంగ్ యూట్యూబ్ ను షేక్‌ చేస్తుంది .. దాదాపు 18 సంవత్సరాల తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల ఈ సినిమాతో మరోసారి కం బ్యాక్ ఇస్తున్నారు .. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ..

ఇదే క్రమంలో ఈ సినిమా ప్రమోషన్లను ఇప్పటికే చిత్రి యూనిట్ మొదలు పెట్టారు .. అందులో బ్యాకంగానే రీసెంట్గా బాలకృష్ణ హౌస్టిగా చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ షో లో వెంకటేష్ సందడి చేశారు. వెంకటేష్ వచ్చిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమోను కూడా రీసెంట్గా రిలీజ్ చేయగా .. ఇక అందులో వెంకటేష్ కూతుర్లతో దిగిన ఫొటోస్ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది .. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది .. ఈ ప్రోమోలో వెంకటేష్ తో పాటు అనిల్ రావుపూడి , సురేష్ బాబు కూడా సందడి చేశారు .. అలాగే ఈ ప్రోమోలో నాగచైతన్య తన కూతుర్ల గురించి కూడా వెంకటేష్ మాట్లాడారు  ..  

అలాగే తన కూతుర్ల ఫోటో చూడగానే .. వెంకటేష్ మై వండర్ఫుల్ డాటర్స్ .. ఆశ్రిత, హవ్య, భావన అంటూ పేర్లు చెప్పుకొచ్చారు.. అలాగే నాగచైతన్యతో దిగిన ఫోటోను కూడా చూస్తూ .. అందర్నీ కౌగిలించుకోవడం కామన్ .. కానీ అతను హగ్ చేసుకుంటే తెలియని సంతోషం వస్తుందని చెప్పాడు. ఇదే క్రమంలో వెంకటేష్ ఇద్దరు కూతుర్లకు ఇప్పటికే పెళ్లిళ్లు అయిపోయాయి .. అలాగే వెంకటేష్ కొడుకు అర్జున్ అందరికంటే చిన్నవాడు .. వెంకటేష్ బాలయ్య ఎపిసోడ్ డిసెంబర్ 27 రాత్రి 7 గంటలకు ఆ హలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ ఎపిసోడ్లో బాలయ్య తో వెంకటేష్ ఇంకెన్ని విషయాలు పంచుకున్నారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: