అల్లు అర్జున్‌ కు మరో షాక్‌.. ఆ సాంగ్ డిలీట్ ?

Veldandi Saikiran

రెండు తెలుగు రాష్ట్రాలను అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లుగా వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంధ్యా థియేటర్  లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో... హీరో అల్లు అర్జున్ ఉచ్చు బిగిసుకుంది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ అక్కడ విఫలమైనప్పటికీ... తప్పు మొత్తం అల్లు అర్జున్ పైకి తోసేసే ప్రయత్నం జరుగుతోందని వార్తలు వస్తున్నాయి.
 
ఇక ఇందులో భాగంగానే ఈ కేసులో ముద్దాయిగా ఉన్న అల్లు అర్జున్ ను ఇటీవల అరెస్టు కూడా చేశారు. ఒకరోజు రాత్రంతా జైల్లోనే... గడిపారు హీరో అల్లు అర్జున్. ఈ కాటు రేవతి కొడుకు శ్రీ తేజ్... ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు... చాలా క్రిటికల్ గా... ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. ఇక అల్లు అర్జున్ అరెస్టు అయిన తర్వాత... అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
 
దానికి కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కూడా పెట్టడం... వివాదంగా మారింది. ఈ ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరు చెప్పకుండానే తెలంగాణ ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో.. యి వివాదం ఇంకా... పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో పుష్ప సినిమాకు మరో ఎదురు దెబ్బ తగిలింది.

సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో పుష్ప‌రాజ్ వెనక్కి తగ్గారు. 'దమ్ముంటే పట్టుకో షెకావత్' అనే సాంగ్‌ను యూట్యూబ్ నుంచి పుష్ప 2 టీం తొలగించింది. సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులను ఉద్దేశించే పాట రిలీజ్ చేశారనే ఆరోపణలు రావడంతో.. టీ సిరీస్ ఈ నిర్ణయం తీసుకుంది. విచారణలో భాగంగా మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ వెళ్తున్న సమయంలోనే ఈ పాటను రిలీజ్ చేశారు. దీంతో క్షణాల్లోనే ఆ పాట వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: