90s లో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో అందాల తార శ్రీదేవి మొదటి స్థానంలో ఉంటుంది. ఈమె తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ ఇలా ఎన్నో ఇండస్ట్రీల్లో నటించింది. అప్పట్లో శ్రీదేవితో సినిమా కోసం హీరోలు, దర్శక నిర్మాతలు వెయిట్ చేసేవారు. ఈ విధంగా స్టార్ గా కొనసాగుతున్నటువంటి శ్రీదేవిని దేశంలోనే బడా వ్యాపారవేత్తలతో పాటు పెద్ద పెద్ద స్టార్లు కూడా పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ ఆమె ప్రేమ మాత్రం పెళ్లి అయినటువంటి బోనీకపూర్ కు మాత్రమే దక్కింది. కానీ బోనీకపూర్ ను శ్రీదేవి ఎంతో టార్చర్ చేసిన తర్వాతే చివరికి పెళ్లికి ఒప్పుకుందట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అందాల తార శ్రీదేవి ప్రస్తుతం ఈ లోకంలో లేకపోయినా ఆమె గురించి రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది.
అయితే ఆమె గురించి ఒక సందర్భంలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. నేను శ్రీదేవిని నా ప్రాణం పోయేవరకు ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాను. అంతేకాదు శ్రీదేవిని మొదట్లో ప్రపోజ్ చేసిన సమయంలో బోనీకపూర్ ను ఆమె ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో కూడా తెలియజేశారు. నేను శ్రీదేవిని నా ప్రేమ గురించి చెప్పి ఒప్పించడానికి ఆరు నెలల సమయం పట్టిందని, నేను ఆమెను ఫస్ట్ టైం ప్రపోజ్ చేసిన సమయంలో బాగా తిట్టి ఆరు నెలల పాటు నాతో మాట్లాడలేదని, నీకు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు నాతో లవ్ ఏంటి అంటూ చాలా కోపానికి వచ్చిందని చెప్పారు.
కానీ నేను పట్టు విడవని విక్రమార్కుడిలా ఆమె వెంటే తిరుగుతూ నా బాధ ఏంటో పూర్తిగా వివరించాను. చివరికి నన్ను అర్థం చేసుకున్న శ్రీదేవి నా ప్రేమను అంగీకరించింది. అలా మా ప్రేమ చివరికి పెళ్లి వరకు వెళ్లిందని ఆయన చెప్పుకొచ్చారు.. కానీ ఆమె నా ప్రేమను అర్థం చేసుకోవడానికి పట్టిన ఆరు నెలల సమయంలో నన్ను ఎంతో టార్చర్ చేసిందని బోనీకపూర్ మరోసారి గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బోనీ కపూర్ శ్రీదేవికి పుట్టిన కూతుర్లలో జాన్వి కపూర్ కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటూ దూసుకుపోతోంది. ఖుషి కపూర్ కూడా ఆ లెవల్ లోనే ముందుకు వెళ్తోంది.