టాలీవుడ్ మహానటిగా పేరు తెచ్చుకుని ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది కీర్తి సురేష్. తాజాగా ‘రఘుతాత’ మూవీతో ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ.ప్రస్తుతం కీర్తి సురేష్ బాలీవుడ్ సినిమాలను కూడా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. కీర్తి సురేష్, వరుణ్ ధావన్, వామికా గబ్బి మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బేబీ జాన్. డైరెక్టర్ అట్లీ నిర్మించిన బేబీ జాన్ ఇవాళ (డిసెంబర్ 25) థియేటర్లలో విడుదలైంది. ఇందులో ఒకప్పటి హీరో జాకీ ష్రాఫ్ విలన్ బబ్బర్ షేర్ పాత్రలో మెప్పించినట్లు సమాచారం.ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రం తమిళ రీమేక్ సినిమా అని చెప్పాలి. 2016 వ సంవత్సరంలో డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో విజయ్ దళపతి సమంతా హీరో హీరోయిన్లుగా నటించిన తేరీ సినిమాని ప్రస్తుతం రీమేక్ చేస్తున్నారు.అట్లీ గత సంవత్సరం బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. దర్శకుడిగా, నిర్మాతగా కొనసాగుతున్న అట్లీ తేరి ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. నిర్మాతగా మారి బాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఖలీస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నటుడు విజయ్ పాత్రలో వరుణ్ ధావన్ అలాగే సమంత పాత్రలో కీర్తి సురేష్ నటించారు.
ఈ సినిమా ద్వారా కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు అయితే ఈ సినిమా నేడు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని విడుదలైంది ఇలాంటి తరుణంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్లలో భాగంగా కీర్తి సురేష్ సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.’ఈ బేబీ జాన్ కథను హిందీ అభిమానులకు అనుగుణంగా మార్చారు, తమిళ తేరిలో సమంత తన నటనను చాలా అందంగా చూపించింది అని చెప్పుకొచ్చింది.తేరి సినిమాలో సమంత ఎంతో అద్భుతంగా నటించారు సాధారణంగా నాకు రీమేక్ చేయాలి అంటే చాలా భయం వేస్తుంది. కానీ బేబీ జాన్‌కి మాత్రం ఆ క్యారెక్టర్‌ని అందంగా తీర్చిదిద్దడం వల్ల నాకు భయం అనిపించలేదు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కీర్తి సురేష్ ఇటీవలె పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు అయితే ఈమె పెళ్లి తర్వాత సినిమాలలో నటించదని చాలా మంది భావించారు కానీ ఈమె మాత్రం పెళ్లైన రెండు రోజులకే సినిమా ప్రమోషన్లలో పాల్గొని ఆ రూమర్లను ఖండించారు.