రేపు సీఎం రేవంత్ తో అల్లు అరవింద్ భేటీ..!

MADDIBOINA AJAY KUMAR
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు ఉండవని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపద్యంలో రేపు సినీ ప్రముఖులు అల్లు అర్జున్, అల్లు అరవింద్, మెగా స్టార్ చిరంజీవి, వెంకటేష్, డైరెక్టర్ దిల్ రాజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నారు. ఉదయం 10 గంటలకు పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వీరందరూ భేటీ కానున్నారు. ఈ మీటింగ్ లో మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, ఉత్తమ్ భాగం కానున్నారు. ఈ మీటింగ్ లో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదనే విషయలపై చర్చించుకొనున్నారు.  
ఇక పోతే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీ తేజ్ కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని డాక్టర్స్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రి ICU లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆ బాలుడి ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నాడని హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు.
ఇక ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్‌ యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఆయనను కలవడానికి చాలా మంది వచ్చి వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో సంధ్య థియేటర్‌ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఓ సినీనటుడిని అరెస్ట్‌ చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: