ఆర్జీవీ: శ్రీదేవిను 'సత్య' అని పిలవడానికి అసలు కారణం అదన్నమాట.?

FARMANULLA SHAIK
టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.నిత్యం ఏదో ఒకవివాదం తో వార్త‌ల‌లో నిల‌వ‌డం, రూపాయి ఖ‌ర్చు పెట్ట‌కుండా సినిమాల‌ని ఎలా ప్ర‌మోట్ చేసుకోవాలో రామ్ గోపాల్ వ‌ర్మ‌కు తెలిసినంత మ‌రే ద‌ర్శ‌కుడికి తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదేమో. సోషల్ మీడియా ద్వారా ప‌లు ర‌కాల కామెంట్స్ చేస్తూ నెటిజ‌న్స్ దృష్టిని ఆక‌ర్షిస్తుంటాడు.అక్కినేని నాగార్జునతో 'శివ' సినిమా తీసి, టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా మారాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసి, బాలీవుడ్‌కి వెళ్లాడు. అక్కడ వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్న వర్మ, తిరిగి టాలీవుడ్‌కి వచ్చి, సినిమాలు చేస్తున్నాడు. ఇదిలావుండగా ఇటీవ‌ల ఓ అమ్మాయితో ఆడిపాడి ర‌చ్చ చేసి ఆ వీడియో షేర్ చేసిన వ‌ర్మ రీసెంట్‌గా బ‌న్నీని మెగాస్టార్ అంటూ ఆకాశానికి ఎత్తాడు.

ఇక తాజాగా తన ఫస్ట్ లవర్ అంటూ స్విమ్ సూట్ లో ఉన్న అమ్మాయి ఫొటో షేర్ చేసాడు వ‌ర్మ‌. ఆమె పేరు సత్య అని తెలియ‌జేసిన వ‌ర్మ విజయవాడ సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న సమయంలో తామిద్దరం లవర్స్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె యూఎస్‌లో మెటర్నిటీ డాక్టర్‌గా పని చేస్తుందని తెలిపారు. ఆ రోజుల్లో మెడికల్ కాలేజీ మరియు ఇంజనీరింగ్ కాలేజ్ కొన్ని కార‌ణాల వ‌ల‌న ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయి. ఆ స‌మ‌యంలో ఆమెని ఇష్ట‌ప‌డ్డాను. కాని ఆమె అందంగా, డ‌బ్బులు ఉన్న వ్య‌క్తి కార‌ణంగా న‌న్ను ప‌ట్టించుకోలేదని భావించాను. ఈ కార‌ణంగానే నేను రంగీలా స్టోరీ రాసుకున్నాను అని వ‌ర్మపేర్కొన్నాడు.ఇదిలావుండగా కేవలం రంగీలా మాత్రమే కాదు, స్టార్ హిట్ సత్య పేరు మరియు క్షణ క్షణంలో శ్రీదేవి పాత్ర పేరు తన మొదటి లేడీ లవ్ నుండి ఉద్భవించిందని అర్జీవి వెల్లడించారు.నా ల్యాండ్ మార్క్ ఫిల్మ్ సత్య మరియు క్షణ క్షణంలో శ్రీదేవి పేరు  పోలవరపు సత్య పేరు పెట్టబడింది. యాదృచ్ఛికంగా ఈ చిత్రాలు ఆమె మియామీ బీచ్ నుండి నాకు పంపిన నేటి ప్రస్తుత ఫోటోలు అని  అతను పోస్ట్ చేశాడు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: