టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే జనసేన అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించి దానిపై చాలా కాలం సమయానికి కేటాయించాడు. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఆయన సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు కేవలం రాజకీయాల పైన దృష్టి పెట్టనున్నట్లు ప్రకటించాడు. దానితో ఆయన అభిమానులు కనీసం సంవత్సరానికి ఒక సినిమా అయినా చేయండి అనే కోరికను బలంగా వెళ్లబుచ్చారు.
దానితో పవన్ కళ్యాణ్ కూడా వీలున్నప్పుడు సినిమాలు చేయడానికి సమయాన్ని కేటాయిస్తాను అని ప్రకటించి వకీల్ సాబ్ అనే మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇకపోతే వకీల్ సాబ్ సినిమా హిందీ సినిమా అయినటువంటి పింక్ కు అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా ... వేణు శ్రీరామ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. మొదట ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలి అనుకున్నప్పుడు వేణు శ్రీరామ్ నీ కాకుండా మరో దర్శకుడిని మేకర్స్ అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల చివరగా వేణు శ్రీరామ్ ను ఈ సినిమాకు దర్శకుడుగా ఎంపిక చేసుకున్నారట.
అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని పవన్ తో రీమిక్ చేయాలి అనుకున్న కొత్తలో హరీష్ శంకర్ అయితే అందుకు పర్ఫెక్ట్ అనే ఆలోచనకు మేకర్స్ వచ్చారట. అందుకు ప్రధాన కారణం అప్పటికే పవన్ తో హరీశ్ గబ్బర్ సింగ్ మూవీ ని రూపొందించి మంచి విజయాన్ని అందుకోవడంతో హరీష్ శంకర్ అందుకు పర్ఫెక్ట్ అని మేకర్స్ అనుకున్నారట. కానీ చివరి నిమిషంలో వేణు శ్రీరామ్ ను ఈ మూవీ కి దర్శకుడిగా దిల్ రాజు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.