సినిమా ఇండస్ట్రీ లో హిట్లు ఉన్న డైరెక్టర్లకి వరుస పెట్టి అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అదే డైరెక్టర్లకు కనుక సరైన విజయాలు లేనట్లయితే వారికి అవకాశాలు పెద్దగా రావు. ఇకపోతే తెలుగు సినిమా పరిశ్రమలో ఓ దర్శకుడు మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తే అందులో రెండు సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. కానీ ఆ దర్శకుడికి సినిమా అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు. ఆ దర్శకుడు ఎవరు ..? ఆయన తీసిన సినిమాలు ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్నినాయన అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తోనే ఈయన దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ దర్శకుడికి సూపర్ సాలిడ్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈయన మాస్ మహారాజా రవితేజ హీరోగా నేల టిక్కెట్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు సోగ్గాడే చిన్నినాయన అనే సినిమాకు కొనసాగింపుగా బంగార్రాజు అనే మూవీ ని రూపొందించాడు.
మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈయనకు సంబంధించిన ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. కొంత కాలం క్రితం చిరంజీవి హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మూవీ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ సినిమా క్యాన్సిల్ అయింది. ఇక ఆ తర్వాత ఈయన తదుపరి మూవీ కి సంబంధించి ఎలాంటి అప్డేట్లు రావడం లేదు.