మోక్షజ్ఞ అలాంటివాడు.. డాకు మహారాజ్ సెట్లో జరిగింది అదే.. బాబి..?

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా స్టార్ట్ కాక ముందే మోక్షజ్ఞ తో సినిమాలు చేయడానికి అనేక మంది టాలీవుడ్ దర్శకులు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ లిస్టు లోకి బాబి కూడా చేరినట్లు తెలుస్తోంది.

తాజాగా బాబి నందమూరి బాలకృష్ణ హీరో గా రూపొందిన డాకు మహారాజ్ అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో బాబి వరుస పెట్టి ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న బాబి , మోక్షజ్ఞ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో బాగంగా బాబి మాట్లాడుతూ ... డాకు మహారాజ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో చాలా సార్లు మోక్షజ్ఞ ఆ సినిమా షూటింగ్ స్పాట్ కి వచ్చాడు. ఆయన అద్భుతమైన హీరో మెటీరియల్. ఆరడుగుల అందగాడు. ఆయనకు సినిమా గురించి , సినిమాకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.

ఆయనకు ఉన్న ఆసక్తిని చూస్తూ ఉంటే అతనితో ఎప్పుడు సినిమా చేయాలా అని కోరిక వేస్తూ ఉంటుంది. ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు అంటూ మోక్షజ్ఞ గురించి బాబి చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతానికి డాకు మహారాజ్ మూవీ పై బాలయ్య అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: