ఆ పాన్ ఇండియా స్టార్ నటి కూతుర్లు.. ఇద్దరు డాక్టర్లే..!
ఈ ఇద్దరి గురించి చెప్పాలంటే మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటించిన నాయకన్ సినిమా ద్వారా హీరోయిన్ గా శరణ్య చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది .. ఈ సినిమాలో అమాయకమైన యువతి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ తర్వాత వరుసగా పలు సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం ఆమెకు వచ్చింది .. హీరోయిన్గా సినిమాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా , అక్కగా , అమ్మగా తమిళ , తెలుగ , మలయాళం , హిందీ భాషలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ధనుష్ హీరోగా వచ్చిన రఘువరన్ బీటెక్ సినిమాలో శరణ్య అమ్మ పాత్రలో నటించారు .. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యారు.
పోన్వన్నన్ కూడా పలు సినిమాల్లో నటించడంతో పాటు దర్శకుడుగా కూడా పలు సినిమాలను తెరకెక్కించాడు .. ఇలా చిత్ర పరిశ్రమలో మంచి హోదా అంతస్తు కలిగిన ఈ జంట తమ వారసులను మాత్రం చిత్ర పరిశ్రమకు దూరంగా పెంచడం విశేషం. ఇక ఈ జంటకి చాందిని , ప్రియదర్శిని అనే ఇద్దరు కూతుర్లు .. ఇద్దరూ చూడడానికి అగ్ర హీరోయిన్లా ఉంటారు ... పొన్వన్నన్ , శరణ్య దంపతులు తమ ఇద్దరి కూతుర్లను ఎంబిబిఎస్ చదివించారు .. ఇద్దరు డాక్టర్లుగా పట్టభద్రులు అయ్యారు .. ఇక గత సంవత్సరం పెద్ద కూతురు చాందిని ఎంబిబిఎస్ పూర్తి చేయగా ఇప్పుడు రెండో కూతురు ప్రియదర్శిని కూడా శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఎంబిబిఎస్ పట్టాను పొందింది. వీటికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.