పుష్ప 2 : సరికొత్త సీన్స్ యాడ్ చేసేది ఎప్పుడంటే..?

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1705 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే ఈ స్థాయి వసూళ్లు కేవలం 21 రోజుల్లోనే రావడం విశేషం.ఈ క్రమంలో బాలీవుడ్లో 'పుష్ప'కు రిలీజ్ ముందు నుంచే విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక సినిమాకు మంచి టాక్ రావడం వల్ల హిందీ వసూళ్లలో పుష్పరాజ్ జోరు ప్రదర్శిస్తున్నాడు. ఒక్క హిందీలోనే ఈ సినిమా రూ.700 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఈ క్రమంలో బాలీవుడ్‌ హిస్టరీలో తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి.ఇదిలావుండగా క్రిస్మస్ నుంచి న్యూఇయర్ వరకు పండగ సీజన్ కావడంతో.. పుష్ప-2 ఇంకా జోరుగా కొనసాగించే అవకాశం కచ్చితంగా ఉంది. అదే సమయంలో మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సినిమాకు మరింత ఫుటేజ్ ను యాడ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.20 నిమిషాల ఫుటేజ్ ను మేకర్స్ యాడ్ చేయనున్నారని సమాచారం.

ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రయత్నాల్లో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. అతి త్వరలో యాడెడ్ సీన్స్ కు సంబంధించిన విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని వినికిడి. మరికొద్ది రోజుల్లో పుష్ప-2 కొత్త వెర్షన్ థియేటర్లలోకి రానుందట.అయితే వాస్తవానికి.. పుష్ప-2 మూడు గంటల 20 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిడివి ఎక్కువే అయినా.. మూవీ బాగుండడంతో ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడు పోస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్.. మరో 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేస్తే రన్ టైమ్ ఏకంగా 3 గంటల 40 నిమిషాలకు చేరనుంది.అదే సమయంలో కొత్త సీన్స్ యాడ్ చేశాక.. ఆడియన్స్, అభిమానులు రిపీట్ మోడ్ లో థియేటర్లకు వస్తారని మేకర్స్ భావిస్తున్నారు.ఇదిలావుండగా పుష్ప- 2' ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు ఇటీవల ట్రెండ్‌ అయ్యాయి. జనవరి రెండో వారం నుంచి స్ట్రీమింగ్‌ కానుందంటూ చర్చ సాగింది. ఆ వార్తలపై మేకర్స్ స్పందించారు. థియేటర్లలో విడుదలైన నాటి నుంచి 56 రోజుల కంటే ముందు ఏ ఓటీటీలోనూ ఈ మూవీ రిలీజ్‌ కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ లెక్కన ఫిబ్రవరి తొలి వారంలో పుష్ప 2 ఓటీటీలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: